ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో గెలుపును అందుకుంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ను తన మార్క్ ఫినిషింగ్ గెలిపించాడు ధోని. 19వ ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ చేతుల్లోనే కనిపించిన మ్యాచ్.. ధోని పవర్ హిట్టింగ్‌తో చెన్నై వశమైంది. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశలో.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఉనద్కట్‌కు బంతి అందించాడు.
కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ.. ఉనద్కట్ తొలి బంతికే వికెట్ అందించాడు. రెండో బంతికి ఒక్క పరుగుల మాత్రమే వచ్చింది. దీంతో 4 బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైక్‌లో ధోని ఉన్నాడు.. ఇంకేముంది. మూడో బంతి సిక్స్, నాలుగో బంతి ఫోర్, ఐదో బంతికి రెండు పరుగులు.. చివరి బంతికి ఫోర్ కొట్టి ధోని మ్యాచ్‌కు షాకింగ్ ఫినిషింగ్ ఇచ్చాడు. ధోనీ ఇన్నింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో లాక్కొచ్చాడంటూ కితాబులిస్తున్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం దర్జాగా పెవిలియన్ వైపు వస్తోన్న ధోనీకి చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా అద్భుతంగా స్వాగతం పలికాడు. ‘ధోని అన్న.. టేక్ ఏ బౌ’ అంటూ గౌరవించాడు. ప్రస్తుతం జాడేజా ధోనికి ఇచ్చిన బౌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ధోనిపై కూడా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. మరి ఈ ధోని ఫినిషింగ్‌పై, జడేజా బౌడ్ డౌన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శివమ్ దూబే బద్ధకానికి CSK బలి! జడేజా కోపంలో అర్థముంది!
Cool,Calm and compose.
Finally Dhoni finishes off his style 🔥 pic.twitter.com/i730Jgr1fg— Sherlòck🫀 (@Valar_Dohaeeris) April 21, 2022
“Should we bow?”
“Yeah, he’s a king”@ChennaiIPL | @msdhoni | #TATAIPL #IPL2022 #YehAbNormalHai #MIvCSK #CSKvMI #Dhoni #WhistlePodupic.twitter.com/m2k27Tx08y— Star Sports (@StarSportsIndia) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.