ఐపీఎల్ 2022లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టుకు పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కింది. దీంతో రాజస్థాన్‌కు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్‌లో బాల్‌తో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి కప్ తమదే అనే ధీమా వ్యక్తం చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 40 పరుగులు చేసిన అశ్విన్ రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా తనలోని ఆల్‌రౌండర్‌ను మరోసారి బయటపెట్టిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
మ్యాచ్ విజయం అనంతరం అశ్విన్ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.”కీలక సమయంలో మంచి ప్రదర్శన కనబర్చడం చాలా సంతోషంగా అనిపించింది. ఒత్తిడిలో ఆడడం నాకు ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయమే కదా మనలో ఉన్న ప్రతిభను భయటపెట్టేది. జైశ్వాల్ మంచి పునాది వేయగా… దానిని నేను కంటిన్యూ చేశాను. ప్లేఆఫ్‌లోనూ ఇదే ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకుంటాం. రాసిపెట్టుకోండి.. ఈసారి కచ్చితంగా రాజస్తాన్ కప్ కొట్టబోతుంది” అని పేర్కొన్నాడు. అశ్విన్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. కాగా అశ్విన్ కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో స్పందించారు. రాజస్థాన్ రాయల్స్‌కు కప్ అందించాలని అశ్విన్ కంకణం కట్టుకున్నాడు.. రాజస్తాన్‌కు కప్ అందించే వరకు వదలడంట.. ఒక్క ఇన్నింగ్స్‌తో మొయిన్ అలీని పక్కకు నెట్టేశాడు.. తన పాత జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్‌తో మెరుస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అంటూ కామెంట్స్ చేశారు.
ఇక ఈ సీజన్‌ను రెండో స్థానంతో ముగించిన రాజస్తాన్ రాయల్స్.. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఒకవేళ మ్యాచ్‌లో ఓడినప్పటికి రాజస్తాన్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో తలపడుతాయి. కాగా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను మే 24 ఆడనుంది. మరి అశ్విన్ ధీమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: రాజస్థాన్ చేతిలో CSK ఓటమికి ధోనినే కారణమా?
.@ashwinravi99 put on a solid all-round show & bagged the Player of the Match award as @rajasthanroyals beat #CSK. 👏 👏
Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/TWPU9ll8Vk
— IndianPremierLeague (@IPL) May 20, 2022