ప్లేఆఫ్స్ సమీపిస్తున్న సమయంలో ప్రతి మ్యాచ్ రసపట్టులో సాగుతోంది. లీగ్ మ్యాచులు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో.. కప్ కలను సాకారం చేసుకునేందుకు అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో.. గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుందామనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు గుమ్మరించింది. బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో చోటుచేసుకున్న ఓక సంఘటన కొందరకి నవ్వులు పూయిస్తుంటే.. మరికొందరికి మాత్రం బాధ కలిగిస్తోంది. ఆర్‌సీబీ బ్యాటర్ కొట్టిన సిక్స్.. ముసలాయన తలకు తగలడంతో నొప్పికి విలవిలాడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లీగ్ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ చావోరేవోలా మారింది. అన్ని జట్లు విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక.. ఆర్‌సీబీ జట్టు ప్రయాణమైతే.. ఐపీఎల్ టోర్నీకి ప్రత్యేకం. ప్రతి సీజన్లో “e sala cup namde”.. అనే స్లోగన్ తో బరిలోకి దిగే ఈ జట్టు.. ఇంతవరకు టైటిల్ కొట్టింది లేదు. ఈ సీజన్ లో కనీసం ప్లే ఆఫ్స్ కు అయినా అర్హత సాధిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో చేతులెత్తశారు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో దారుణ ఓటమిని చవిచూశారు. అయితే.. ఈ మ్యాచులో ఆర్‌సీబీ బ్యాటర్ రజత్ పటిదార్ కొట్టిన సిక్స్.. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక పెద్దాయన తలకు తగలడంతో నొప్పికి విలవిలాడిపోయాడు. పక్కనున్న మహిళ అయన తలను రుద్దుతూ ఓదార్చుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మ్యాచ్ అయితే గెలవరు కానీ, రక్తం కారేలా తలలు పగలగొడతారే.. అని కామెంట్ చేస్తున్నారు.
— Varma Fan (@VarmaFan1) May 13, 2022
ఇది కూడా చదవండి: Faf du Plessis: కోహ్లీ ఎలా ఆడిన అవుట్ అవుతున్నాడు: డుప్లెసిస్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ విజృంభణతో 20 ఓవర్లలో 209 పరుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్ల వరకు పటిష్టంగానే కనిపించింది. వికెట్లు పడినప్పటికి ఓవర్‌కు 10 పరుగులు చొప్పున రాబట్టారు. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. హర్‌ప్రీత్ బార్, రబాడలు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆర్సీబీపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
.@jbairstow21 set the ball rolling for @PunjabKingsIPL and bagged the Player of the Match award for his stunning knock. 👌 👌
Scorecard ▶️ https://t.co/jJzEACTIT1#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/HLkKfpD8x0
— IndianPremierLeague (@IPL) May 13, 2022
After Match No. 6⃣0⃣ of the #TATAIPL 2022, here’s how the Points Table looks 🔽 #RCBvPBKS pic.twitter.com/tCYVb2Z47g
— IndianPremierLeague (@IPL) May 13, 2022