ఐపీఎల్ 2022లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు ఎవరు అర్హత సాధిస్తారో తెలుసుకోవాలంటే.. ఒక సారి ఇరు జట్ల బలాబలాలు పరిశీలిద్దాం.
రాజస్థాన్ రాయల్స్..
బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఓపెనర్ జోస్ బట్లర్‌పై బ్యాటింగ్‌లో ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే సంజూ శాంసన్ చిన్న చిన్న ఇన్నింగ్స్‌లతోనే సరిపెడుతుండడం ఆ జట్టుకు భారంగా మారుతోంది. యుజ్వేంద్ర చాహల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, మెకాయ్, ప్రసిద్ధ్ కృష్ణతో బౌలింగ్ ఎటాక్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో మరోసారి బట్లర్ రాణిస్తే తప్ప రాజస్థాన్‌లో పెద్దగా ఆశలు పెట్టుకునే ప్లేయర్ లేడు. చివర్లో హెట్‌మేయర్ ధాటి ఆడకపోయినా, త్వరగా అవుట్ అయినా రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
బ్యాటింగ్‌లో ఆర్బీసీ మెయిన్ పిల్లర్స్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లలో ఏ ఇద్దరు రాణించినా ఆర్సీబీని ఆపడం అసాధ్యం. పైగా యువ ఆటగాళ్లు రజత్ పటీదార్, లోమ్‌రోర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక దినేష్ కార్తీక్ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటీదార్ ఎలిమినేటర్‌లో లక్నోపై సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్ అతనికి ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉంటుంది. ఇక బౌలింగ్‌లో కూడా ఆర్సీబీ పటిష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా హసరంగా, హేజల్‌వుడ్, హర్షల్ పటేల్.. ఈ త్రిబుల్ హెచ్ దళం ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. హసరంగాతో పాటు షాబాజ్, మ్యాక్స్‌వెల్ కూడా ప్రమాదకరంగా మారుతారు.
పిచ్..అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 170 పైనే పరుగులు చేసే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అలాగే తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ కొంత నిరాశలో ఉంది. పైగా వారిపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది.
తుది జట్లు అంచనా..
ఆర్సీబీ.. ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, మ్యాక్స్‌వెల్, లోమ్‌రోర్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మాద్, వనిందు హసరంగా, జోస్ హేజల్‌వుడ్, మొహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.
రాజస్థాన్..సంజూ శాంసన్(కెప్టెన్), జోస్ బట్లర్, జైశ్వాల్, దేవదత్త్ పడిక్కల్, హెట్‌మేయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, మెకాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇదీ చదవండి: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్! వివరణ ఇచ్చుకున్న మిస్టర్ 360
Ready to paint Ahmedabad RED. 🔴
Let’s do this, boys! 💪🏻😎#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #RRvRCB pic.twitter.com/H5rb65UJW1
— Royal Challengers Bangalore (@RCBTweets) May 27, 2022