ఐపీఎల్ 2022లో శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలు కొంత క్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ తన నిజాయితీని చాటుకున్నాడు.
దీంతో అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హూడాతో డికాక్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. ఇద్దరు చూడచక్కటి షాట్లతో స్కోర్‌ను 90 పరుగులు దాటించారు. పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 13వ నాలుగో బంతిని ఆడబోయిన డికాక్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్‌చేతుల్లో పడింది. బౌలర్ అప్పీల్ చేసినా మిగతా వాళ్లు పెద్దగా అప్పీల్ చేయలేదు.
దీంతో అంపైర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ.. డికాక్ మాత్రం నిజాయితీగా తన బ్యాట్‌కు బంతి తగిలిందని క్రీజ్ వదిలి పెవిలియన్‌కు వెళ్లాడు. దీంతో అంపైర్ అవుట్ ఇవ్వకున్నా.. నిజాయితీగా అవుట్‌ను ఒప్పుకుని క్రీడా స్ఫూర్తిని చాటిన డికాక్‌పై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో సచిన్ టెండూల్కుర్ కూడా ఇలానే అంపైర్ అవుట్ ఇవ్వకున్నా.. నిజాయితీ క్రీజ్ వదిలి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Livingstone: ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిన పంజాబ్! లివింగ్‌స్టోన్‌పై ఫ్యాన్స్ ఫైర్
ICYMI – Spirit of cricket: Quinton de Kock walks after edging the ball.
📽️📽️https://t.co/u1Htv2n2F4 #TATAIPL #PBKSvsLSG
— IndianPremierLeague (@IPL) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.