ఐపీఎల్ 2022లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 140 పరుగులతో కదం తొక్కాడు. డికాక్ కేవలం ఫోర్లు, సిక్సులతోనే వంద పరుగులు చేయడం విశేషం. డికాక్ సెంచరీకి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేసి రాణించడంతో లక్నో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను అందుకున్నాడు. కేకేఆర్‌పై ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా కేఎల్ రాహుల్, డికాక్ జోడీ నిలిచింది.
అంతకుముందు 2012లో గిబ్స్, రోహిత్ కలిసి కేకేఆర్‌పై 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఆ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్, డికాక్ జోడీ 210పరుగులతో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచింది. ఇక ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ(210) పేరిట నమోదైంది. ఇక ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డులోనూ కేఎల్ రాహుల్, డికాక్ జోడీ మరో రికార్డును నమోదు చేసింది. 2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ, డివిలియర్స్ జోడీ 229 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అదే జోడీ 2015లో ముంబైపై 215 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ (210) ఉంది.
ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డ్‌లోనూ క్వింటన్ డికాక్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ ( ఆర్సీబీ) – 175పరుగులు నాటౌట్ ఉండగా, రెండో స్థానంలో బ్రెండన్ మెక్కల్లమ్ (కేకేఆర్) – 158నాటౌట్ ఉన్నాడు. మూడో స్థానంలో క్వింటన్ డికాక్ (లక్నో) – 140పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇక 4, 5 స్థానాల్లో వరుసగా ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ) – 133నాటౌట్, కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్ ) – 132 టాప్ 5లో ఉన్నారు. ఇక తాజా మ్యాచ్ ద్వారా ఇక 20 ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా ఆడిన తొలి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ కూడా ధీటుగానే బదులిచ్చింది.
ఇక మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆ ఫ్రాంచైజ్‌పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. డికాక్ ఇన్నింగ్స్‌ను చూసి ఇలాంటి ప్లేయర్‌ను ఎలా వదులుకున్నారంటూ మండిపడుతున్నారు. 2019 నుంచి 2021 సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన డికాక్ మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ ముంబై ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రిటేన్ చేసుకోలేదు. దీంతో డికాక్‌ను రూ. 6.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో దక్కించుకుంది. ఇక పెట్టిన పైసలకు తగ్గట్లు డికాక్ ఈ సీజన్లో 14మ్యాచ్‌లు ఆడి 502పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు సహా, ఒక సెంచరీ ఉంది. అతని స్ట్రైక్ రేట్ 149గా ఉంది. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఇలా మంచి ప్లేయర్లను దూరం చేసుకుని ముంబై ఈ సీజన్‌లో విఫలం అయిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరి క్వింటన్ డికాక్ కేకేఆర్‌పై ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rahul Tripathi: SRH ప్లేయర్ రాహుల్ త్రిపాఠికి.. టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు?
What a player.. Quinton de cock pic.twitter.com/AqiKR4qhMu
— ABD DEVA (@ABDDEVA3) May 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.