ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 20 పరుగులు తేడాతో పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నోను పంజాబ్ బౌలర్లు 153 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో సూపర్ బ్యాటింగ్ పవర్‌తో ఉన్న పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఊదేస్తుందని అంతా భావించారు. 154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(25), శిఖర్ ధావన్ వెనువెంటనే పెవిలియన్ చేరారు.
దుష్మంత్ చమీరా బౌలింగ్‌లో మయాంక్ క్యాచ్ ఔటవ్వగా.. ధావన్‌ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే భానుక రాజపక్స(9)ను కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చగా.. లివింగ్ స్టోన్(18)తో కలిసి జానీ బెయిర్ స్టో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 88 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఉన్న సమయంలో లివింగ్ స్టోన్ ఆడిన ఒక చెత్త షాట్ మ్యాచ్ మొత్తాన్ని మలుపుతిప్పింది. మోహ్‌సీన్ ఖాన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ అవుట్ అయిన తర్వాత లక్నో బౌలర్లు చెలరేగిపోయారు. ఆ వెంటనే జితేశ్ శర్మ(2)ను కృనాల్ వికెట్ల ముందు బోల్తాకొట్టించగా.. జానీ బెయిర్ స్టోను చమీరా పెవిలియన్ చేర్చాడు.రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడంతో భారీ షాట్లకు ప్రయత్నించిన రబడా (2), రాహుల్ చాహర్(4) పెవిలియన్ చేరారు. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 31 పరుగులు అవసరమవ్వగా.. రిషి ధావన్ 6, 4తో ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ తర్వాతి నాలుగు బంతులను ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసి ఒక్క పరుగు ఇవ్వలేదు. దాంతో లక్నో మ్యాచ్‌ను గెలిచింది. బెయిర్‌స్టో లివింగ్‌స్టోన్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో లివింగ్ స్టోన్ ఇంకొంత బాధ్యతయుతంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్ కచ్చితంగా పంజాబ్ గెలిచేది. కానీ లివింగ్ స్టోన్ బాధ్యతారహితంగా ఆడి అవుట్ అవ్వడం రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడంతో ఒత్తిడిలో బెయిర్‌స్టో కూడా అవుట్ అయ్యాడని పంజాబ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లివింగ్‌స్టోన్‌పై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: అవసరమైతే కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెడతాం: గంగూలీ
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.