‘పంజాబ్ కింగ్స్‘.. ఈ పేరుకు తగ్గట్టుగా మంచి ఆటగాళ్లు ఉన్న జట్టు. కానీ, ప్రదర్శన మాత్రం అంతంత మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఎలా ఉంటుందో.. ఐపీఎల్ జట్టైనా పంజాబ్ కింగ్స్ ఆటతీరు అచ్చం అలానే ఉంటుంది. ఏరోజు చెలరేగుతారో తెలియదు.. ఏరోజు తోక ముడుస్తారో తెలియదు. ఐపీఎల్ 2022 సీజన్ లో భారీ హిట్టర్లతో నిండిన ఈ జట్టు.. పైకి బలంగా కనిపించినప్పటికీ స్థాయికి తగ్గట్టుగా ఏ ఒక్కరు రాణించడం లేదు. బుధవారం(ఏప్రిల్ 20) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ధారణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్ జట్టు సహా యజమాని అయిన ప్రీతి జింటా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 సీజన్ ను ఆర్సీబీపై విజయంతో ప్రారంభించిన పంజాబ్.. కేకేఆర్ తో జరిగిన రెండో మ్యాచులో ఓటమి పాలయ్యింది. కేకేఆర్ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న.. పంజాబ్ మూడో మ్యాచులో చెన్నైని భారీ తేడాతో ఓడించింది. ఆపై.. గుజరాత్ చేతిలో ఓటమి చెందినా పుంజుకొని ముంబైపై ఘన విజయం సాధించింది. కానీ, తెలుగు జట్టైన సన్ రైజర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక.. ఢిల్లీ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 3 విజయలు, 4అపజయాలతో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
IPL 2022 updated Points Table#CSKvsMi | #CSKvMI pic.twitter.com/EKwp5W7uWk
— Ritik (@Ritik800) April 21, 2022
ఇది కూడా చదవండి: రన్ తీయకుండా ముచ్చట్లు.. రనౌట్ చేసిన పంత్
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ.. ఇలా చెప్పుకుంటే పోతే చాల మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా రాణించలేకపోతోంది. ఇక.. సపోర్టింగ్ స్టాఫ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిక్సులు ఎలా కొట్టాలో నేర్పించడానికి.. ఒక కోచ్ ను నియమించారంటేనే అర్థం చేసుకోవచ్చు పంజాబ్ కోచింగ్ స్టాఫ్ ఎలా ఉందో. మెగా వేలంలో భారీ ధర పెట్టి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసినా రాణించకపోవడంతో పంజాబ్ యాజమాన్యానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
𝗥𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝘆 𝗺𝗼𝗱𝗲 🔛 ! #SaddaPunjab #PunjabKings #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ @liaml4893 pic.twitter.com/vrXo6OktQl
— Punjab Kings (@PunjabKingsIPL) April 21, 2022
బుధవారం(ఏప్రిల్ 20) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో పంజాబ్ బ్యాటర్స్ ధారణంగా విఫలమయ్యారు. 20 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. 116 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి త్యధిక బంతులు(57) మిగిలిండగానే 100 కుపైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఈ మ్యాచులో ఆటగాళ్ల ప్రదర్శనపై పంజాబ్ జట్టు సహా యజమాని అయిన ప్రీతి జింటా సంత్రప్తికరంగా లేనట్టు సమాచారం. టోర్నీ మొదలైన నాటి నుంచి యజమానిగా కొనసాగుతున్న ప్రీతి జింటాకి టైటిల్ అందుకోవడం అనేది పీడకలగా మిగిలిపోయింది. ఈసారైనా ఆ కోరిక నెరవేరుతుందా అంటే.. ఆటగాళ్ల ప్రదర్శన ఇలా ఉంది. మరి ప్రీతి జింటా కోరిక నెరవేరుతుందా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
“A day to forget and move on” 🗣 Mayank Agarwal #SaddaPunjab #IPL2022 #DCvPBKS #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/Up14ByIERk
— Punjab Kings (@PunjabKingsIPL) April 20, 2022
Time to rally up and roar 👊🏽#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/31fudY6VnC
— Punjab Kings (@PunjabKingsIPL) April 21, 2022
ఇది కూడా చదవండి: తనలో దాగి ఉన్న స్పెషల్ టాలెంట్‌ను బయటపెట్టిన ధావన్