IPL 2022: నిజంగానే పవర్‌ కట్టా? అంబానీ చేసిన పనే అంటూ ఫన్నీ ట్రోల్స్!

ఐపీఎల్‌ 2022లో గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ మధ్యలో పవర్‌ కట్‌ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రపంచలోనే అతి పెద్ద, అత్యంత రిచ్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌లో ఇలా కరెంట్‌ లేక కీలకమైన డీఆర్‌ఎస్‌ నిలిపివేయడంతో లీగ్‌ పరువు దిగజారింది. ఆ కొన్ని నిమిషాలలోనే ఒక జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపడంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో క్రికెట్‌ అభిమానులు బీసీసీఐ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లీగ్‌లో ఇంత అలసత్వమా? అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ముంబై ఇండియన్స్ తొండాట అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవడం కోసం ముఖేష్ అంబారీ ఇలా పవర్ కట్ చేశాడంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్‌ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్‌లు లేకుండానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించాడు. ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి. అయితే పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ కూడా డకౌట్ అయ్యాడు… టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా.. రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వరల్డ్ బెస్ట్ లీగ్‌కు పవర్ కట్ సమస్యగా మారడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Tilak Varma: టీమిండియాలోకి తెలుగు తేజం తిలక్‌ వర్మ! విరాట్‌ కోహ్లీ స్థానంలోనే..

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV