క్రికెటర్లకు కోట్లలో అభిమానులు ఉంటారు. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి సూపర్‌స్టార్ క్రికెటర్లకు వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన క్రికెటర్లను కలవాలని, వారితో ఒక ఫొటో దిగాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కొంత మంది దానికి కోసం సాహసం కూడా చేస్తుంటారు. స్టేడియంలో సీరియస్‌గా మ్యాచ్ జరుగుతున్న సమయంలో 20 అడుగుల ఎత్తున్న ఫెన్సింగ్‌లను దూకి మరీ తమ ఫేవరేట్ క్రికెటర్‌ని కలిసేందుకు వస్తుంటారు. ఇలాంటి సంఘటనే బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో.. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసేందుకు ఒక వీరాభిమాని ఫెన్సింగ్ దాటుకుని మరీ వచ్చాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వద్దకు పరిగెత్తుకు వస్తున్నాడు. బయోబబుల్‌లో ఉన్న కోహ్లీ.. తనని దూరం నుంచే గమనించాడు. దగ్గరి రావద్దు అంటూ కోరాడు. కానీ.. ఇంతలోనే ఒక పోలీస్ అధికారి వచ్చి.. ఆ అభిమానిని అమాంతం భుజాన వేసుకుని గ్రౌండ్ బయటికి పరుగు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ పోలీస్‌ను బాహుబలి పోలీస్ అంటున్నారు. బాహుబలిలో హీరో ప్రభాస్.. పెద్ద శివలింగాన్ని అమాంతం ఎత్తి భుజాన వేసుకున్నట్లు ఈ పోలీస్ కూడా పెన్సింగ్ దాటి వచ్చిన అభిమానిని భుజాన వేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత.. పోలీస్ అధికారి స్ట్రైల్‌ను విరాట్ కోహ్లీ అనుకరించడం మరో విశేషం. పోలీస్ తన అభిమానిని ఎత్తుకున్న స్టైల్‌ను ఇమిటేట్ చేసి కోహ్లీ నవ్వులు పూయించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి విరాట్ కోహ్లీ అభిమానిని పోలీస్ ఎత్తుకెళ్లిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Gautam Gambhir: ఊహించని ఓటమితో సహనం కోల్పోయిన గంభీర్! కేఎల్ రాహుల్‌ను పొట్టుపొట్టు తిట్టాడు
When the intruder towards Virat Kohli at Eden Gardens – VK couldn’t control his laugh seeing policeman’s reaction 😂 pic.twitter.com/Ctvw8fU4uy
— sohom ᱬ (@AwaaraHoon) May 26, 2022