ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులు చేయలేక గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌లో దారుణంగా విఫలం అవుతున్న ముంబై ఇండియన్స్ ఈ గెలుపును గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పుకొవచ్చు. ఎందుకంటే కచ్చితంగా గెలిచే దశలో ఉన్న గుజరాత్ అనవసరమైన రెండు రనౌట్లు, ఒక హిట్ వికెట్‌తో మ్యాచ్‌ను ముంబై చేతుల్లో పెట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్‌ను ములపుతిప్పింది. 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా శుభారంభం అందించారు.
గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీల తర్వాత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మురుగన్ అశ్విన్ విడదీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్ దూకుడుగా ఆడారు. అయితే సాయి సుదర్శన్ విచిత్రకర రీతిలో హిట్ వికెట్ అయ్యాడు. విజయానికి చేరువలో హార్దిక్ పాండ్యా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇది మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో మిల్లర్ సిక్సర్ బాదడంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి. డానియల్ సామ్స్ అద్భుతమైన బౌలింగ్‌తో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్ ఓటమిని శాసించాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో తెవాటియా రనౌటయ్యాడు. దాంతో ఒత్తిడికి గురైన గుజరాత్.. చివరకు ఓటమిపాలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Kane Williamson: ఏంటి కేన్ మామ.. ఏమైంది నీకు? SRHని ముంచేశావుగా!
𝐖𝐡𝐚𝐭. 𝐀. 𝐖𝐢𝐧. 🔥#OneFamily #DilKholKe #MumbaiIndians #GTvMI @ImRo45 @ishankishan51 @timdavid8 pic.twitter.com/PM9wh2gdVw
— Mumbai Indians (@mipaltan) May 6, 2022
WHAT JUST HAPPENED!? 🤯😳😥#SeasonOfFirsts #AavaDe #GTvMI pic.twitter.com/33VyEfoVPX
— Gujarat Titans (@gujarat_titans) May 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.