టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ క్రికెటర్‌ను ఒక యంగ్ క్రికెటర్ కొట్టేశాడు. అది కూడా బాల్‌తో గుచ్చికొడితే.. కోహ్లీ తొడపై భారీ దెబ్బపడింది. కానీ.. అది సీరియస్‌గా కాదు.. సరదాగా కూడా కాదు. మ్యాచ్‌లో భాగంగా.. కోహ్లీని రనౌట్ చేయబోయిన చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్ ముఖేష్ చౌదరి.. విసిరిన త్రో మిస్ అయి కోహ్లీకి గట్టిగా తగిలింది. ఈ సంఘటన ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది.
ముఖేష్ చౌదరి వేసిన ఓవర్‌లో కోహ్లీ లాంగ్ ఆన్ దిశగా బంతిని కొట్టి రన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే బంతి అందుకున్న ముఖేష్ చౌదరి వికెట్ల వైపు విసిరాడు. గమనించిన కోహ్లీ వెనక్కి తిరిగాడు. దీంతో బంతి కోహ్లీ తొడకు తగిలింది. దీంతో కాస్త ఆందోళప పడ్డ ముఖేష్.. కోహ్లీ వంక చూస్తూ సారీ బ్రో అన్నాడు. ఇక కోహ్లీ సైతం పర్లేదు ముఖేష్ నువ్వేం కావాలని చేయలేదుగా అన్నట్లు చిరునవ్వుతో బదులిచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ముఖేశ్ చౌదరి.. మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 11వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో తడబడ్డ చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగుల చేసి, 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022 CSK vs RCB: కోహ్లీ.. నీ ప్రవర్తన ఇక మారదా? ధోని ముందే ఇలా చేస్తావా?
— Patidarfan (@patidarfan) May 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.