ఐపీఎల్ 2022లో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమిని చవిచూసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ మ్యాచ్ అనంతరం CSK కెప్లెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. అయితే తమ టీమ్ బ్యాటింగ్‌లో విఫలమైన తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చాని అన్నాడు. ముఖ్యంగా సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరీ అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నాడు.
‘ఎలాంటి వికెట్ అయినా సరే 130 పరుగుల కంటే తక్కువ ఉన్న లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే నేను మాత్రం మా బౌలర్లకు చెప్పింది ఒక్కటే. ఫలితం ఎలా ఉన్నా సరే మీ సత్తా ఏంటో చూపించండి. సాయశక్తులా పోరాడండని చెప్పాను. యువ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పరిస్థితులతో సంబంధం లేకుండా రాణించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కనబర్చారు. సిమ్రన్ జిత్ సింగ్, ముఖేష్ చౌదరి అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరి సూపర్ బౌలింగ్ వచ్చే ఏడాది మాకు కలిసొచ్చే అంశం. ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్ర ఒత్తిడి ఉంటే పవర్‌ప్లేలో ఎదుర్కొనే బంతులు చాలా కీలకం. కానీ ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొంతమంది బ్యాటర్లు అద్భుత బంతులకు ఔటయ్యారు. అయితే ప్రతీ మ్యాచ్‌తో వారు గుణపాఠం నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నా.’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ(32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) కడవరకు నిలిచి విజయాన్ని లాంఛనాన్ని పూర్తి చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. మరి మ్యాచ్ అనంతరం ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK vs MI: వేల కోట్ల ఐపీఎల్‌లో ఇంత దారుణమా..! గ్రౌండ్ లో పవర్ కట్!
If you are one of the young Indian speedsters playing the #TATAIPL, this will encourage you even more. ☺️ ☺️
Hear what the legendary MS Dhoni said 👇 #CSKvMI pic.twitter.com/aWgvsQZq4o
— IndianPremierLeague (@IPL) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.