ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి నాలుగు వరుస ఓటముల తర్వాత బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మాస్టర్ మైండ్ ధోని మరోసారి తన మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాడు. లక్ష్యం భారీగా ఉన్నా.. కోహ్లీ లాంటి ఆటగాడు ఇలాంటి పిచ్‌పై కుదురుకుంటే.. ఎంతటి లక్ష్యంమైన చిన్నబోతుందన్న విషయం బాగా తెలిసిన ధోని.. కింగ్ కోహ్లీ కోసం ఒక పద్మవ్యూహాన్నే ఏర్పాటు చేశాడు.
కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు అనుభవం లేకపోవడంతో.. కోహ్లీని పెవిలియన్ పంపే బాధ్యతను ధోని తీసుకున్నాడు. అందుకోసం ఒక సూపర్ ఫీల్డ్ సెట్‌అప్ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. డీప్ స్క్వైర్ లెగ్‌లో ఫీల్డర్ లేడు. దీంతో విరాట్ కోహ్లీ బలం బలహీనతలు తెలిసిన ధోని.. వెంటనే డీప్ స్క్వైర్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టాడు. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దూబేను అక్కడికి పిలిపించాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ జడేజా.. సైలెంట్‌గా ఉండిపోయాడు.
యువ బౌలర్ ముఖేష్ చౌదరీ బౌలింగ్ కోహ్లీ.. డీప్ స్క్వైర్ లెగ్ పైనుంచి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో.. ధోని సెట్ చేసిన ఫీల్డర్ చేతికి చిక్కాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. కోహ్లీ.. అవుట్‌తో ఆర్సీబీ డగౌట్ అంత నిరాశలో మునిగిపోయింది. ధోని వేసిన ప్లాన్‌తో కోహ్లీ అవుట్ అవ్వడంతో పాటు ఆ ప్రభావం జట్టు మొత్తంపై పడింది. దీంతో.. ధోని మాస్టర్ మైండ్‌పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB బౌలర్లకు చుక్కలు చూపించిన CSK బ్యాటర్స్!
— Addicric (@addicric) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.