ఐపీఎల్ 2022లో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ మేజిక్ చేశాడు. తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం బ్యాటర్‌గా మాత్రమే పరిమితం కాలేదు. వికెట్ల వెనక ఉండి కథ నడిపించాడు. షాడో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బిగ్ ఫిష్ కీరన్ పొలార్డ్ కోసం ధోనీ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఎనిమిది బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి.. ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్‌ను అవుట్ చేయడానికి ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు.
ఫీల్డింగ్ సెట్ చేసిన మరుసటి బంతికే అతను అవుట్ అయ్యాడు. 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహీష్ తీక్షణ వేసిన ఓవర్‌లో తొలి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీశాడు. పొలార్డ్ స్రై‍్టక్‌లోకి వచ్చాడు. ధోని వెంటనే స్ట్రెయిట్‌గా ముగ్గురు ఫీల్డర్లను మొహరించాడు. ఆఫ్ సైడ్ ప్లేయర్లను కాస్త దూరంగా వెళ్లాలంటూ సైగ చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న ఫీల్డర్లనూ అలర్ట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాలంటూ సూచించాడు. తీక్షణ సంధించిన షార్ట్ లెంగ్త్ బంతిని పొలార్డ్ లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు. అది కాస్త నేరుగా వెళ్లి శివం దూబే చేతుల్లో పడింది. ఇలా పొలార్డ్‌ను ఒక పక్కా వ్యూహంతో ధోని అవుట్ చేశాడు. నిజానికి లాంగ్‌ఆన్ పైనుంచి పొలార్డ్ భారీ షాట్లు ఆడతాడు. అది అతని ఫెవరేట్ స్పాట్.
అలాంటి చోటే షాట్లు ఆడు.. అనే విధంగా ఫీల్డ్ పెట్టి మరీ.. పొలార్డ్‌ను ధోని రెచ్చగొట్టాడని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పొలార్డ్‌కు తన బలంపై అతి విశ్వాసం క్రియేట్ చేసి మరీ అతన్ని అవుట్ చేశాడంటే సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. లాంగ్ ఆన్‌లో ముగ్గురు ఫీల్డర్లనుపెట్టడంతో పొలార్డ్ ఈగో హర్ట్ అయిందని.. తన సత్తా ఏంటో? లాంగ్‌ఆన్ సిక్స్ కొడితే ఎలా ఉంటుందో ధోనికి చూపించాలనే కసితో పొలార్డ్ ఆ షాట్ ఆడినట్లు అనిపిస్తుంది. కానీ అది సరిగా టైమ్ కాలేదు.. దీంతో దూబేకు క్యాచ్‌గా వెళ్లింది. పొలార్డ్ ఈగోకు వెళ్లి ఇలాంటి తప్పుడు షాట్ ఆడతాడని గ్రహించిన ధోని.. అందుకు తగ్గట్లు ఫీల్డ్ సెట్ చేశాడని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: వీరి స్నేహం ఎంతో మధురం! గ్రౌండ్‌లోనే బ్రావోకు పొలార్డ్ ముద్దు!
MS Dhoni set field and next ball Pollard out🔥
Wow wow wow😍..just too epic 🔥#Mahi🙏 #CSKvsMI #MIvsCSKpic.twitter.com/Ure8fCW9kU
— Riaaaaa (@riaa0riaa) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.