టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ మహేంద్రుడికి చివరిదని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. 2023 ఐపీఎల్ సీజన్ లో సైతం తాను ఆడుతున్నట్లు ప్రకటించాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో తన చిట్టచివరి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. కామెంటేటర్ ధోనీని మీరు తర్వాతి సీజన్ లో ఆడతారా అని అడగ్గా.. ధోనీ కుండబద్ధలు కొట్టినట్లు బదులిచ్చాడు. వచ్చే సీజన్ లో తప్పకుండా తాను ఆడతానని పేర్కొన్నాడు.
“తప్పకుండా నెక్స్ట్ సీజన్ లో ఆడతాను. చెన్నై తరఫున చెన్నైలో ఆడకపోవడం, చెన్నై అభిమానులకు నా చివరి మ్యాచ్ ద్వారా వీడ్కోలు పలకకపోవడం అన్యాయం. ఈ సీజన్ లో మ్యాచ్‌లన్నీ ముంబైలో జరిగాయి. ముంబై కూడా మంచి వేదిక. కానీ, నా కెరీర్ ముంబై వేదికగా ముగించడం సరికాదు. అలా చేస్తే సీఎస్కే అభిమానులు చాలా ఫీలవుతారు. వచ్చే సీజన్ లో కొవిడ్ నిబంధనలు పెద్దగా ఉండకపోవచ్చని ఆశిస్తున్నాను. అలాంటప్పుడు అన్ని జట్లు ముంబైతో పాటు వివిధ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే అవకాశముంటుంది. ఫైనల్‌గా చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానులకు వీడ్కోలు పలికేందుకు ఓ ఛాయిస్ ఉంటుంది”.
Definitely, Yes From MS Dhoni for IPL 2023#CricketTwitter #Dhoni #MSDhoni #CSK𓃬 pic.twitter.com/oYTwA817xc
— Cricket Addictor (@AddictorCricket) May 20, 2022
“ఇక ఐపీఎల్ లో ఆడడం ఇదే నాకు చివరి సీజన్ అవుతుందో లేదో అనేది ఇంకా నాకు ఓ పెద్ద ప్రశ్నలాంటిదే. ఎందుకంటే నిజంగా రెండు సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కోవిడ్ లాంటి పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందో అంచనా వేయలేము. కానీ కచ్చితంగా నేను వచ్చే ఏడాది మరింత పట్టుదలతో చెన్నై జట్టుతో తిరిగి రావడానికి కృషి చేస్తాను” అని ధోనీ పేర్కొన్నాడు.
This time ” Definitely yes “🥺💥
Thala 🥺🥺🥺🥺💛💛#CSK𓃬 #Dhoni #MSDhoni𓃵 #DefinitelyNot #Yellove #WhistlePodu #thala @ChennaiIPL @msdhoni pic.twitter.com/cffKwNZGRn— Ajayprasath (@ajayprasath720) May 20, 2022
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్నా మ్యాచులో.. చెన్నై గెలిచినా, గెలవకున్నా పెద్దగా పోయేదేం లేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌ను కాస్త తల ఎత్తుకునేలా ముగించాలని మాత్రం భావిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2020సీజన్ లో ప్లేఆఫ్ చేరకుండా ఇంటిబాట పట్టిన చెన్నై.. 2021 సీజన్ లో ఛాంపియన్స్ గా అవతరించింది. ఈ సీజన్ లోనూ ప్లేఆఫ్ చేరకుండానే ఇంటిబాట పడుతుంది కనుక.. వచ్చే ఏడాది టైటిల్ సాధిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ధోనికి వీడ్కోలు పలకడానికైనా వచ్చే ఏడాది కాస్త బాధ్యతాయుతంగా ఆడతారనే చెప్పాలి. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులాడిన చెన్నై 4 విజయాలు, 9 ఓటములతో 9 వ స్థానంలో ఉంది. మరి.. ధోనీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతానని ప్రకటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Woohoo !! Thala going to be playing another year for sure, in Chepauk & all around India. Isn’t this music to our ears.
Always cares for fans. 🙏
As we say, a player like MS Dhoni once in 100 years, but a human like him walks once a lifetime#WhistlePodu #Dhoni #MSDhoni #CSK pic.twitter.com/o3GIg5kuLS
— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) May 20, 2022
2019
MS Dhoni : Hopefully, Yes.2020
MS Dhoni : Definitely, Not.2021
Dhoni : Still I haven’t left behind.2022
Dhoni: Definitely, it will be unfair not to say thanks to Chepauk crowd. #CSKvRR #MSDhoni #TATAIPL #Dhoni #IPL2022 pic.twitter.com/i4tiNI24AY— Adnan Khan (@Kh35955807Adnan) May 20, 2022