ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి నాలుగు వరుస ఓటముల తర్వాత బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో కూడా మూడు చూడచక్కటి ఫోర్లతో అలరించాడు. అంతకాక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సృష్టించిన హెలికాప్టర్ షాట్‌ను ఆడాడు సిరాజ్. ఆ షాట్‌ను కనిపెట్టిన ధోని వికెట్ల వెనుక కీపింగ్ చేస్తుండగానే.. హెలికాప్టర్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు సిరాజ్.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ టాప్‌ఆర్డర్ విఫలం అయింది. కానీ.. చివర్లో షాబాబ్ అహ్మాద్, ప్రభుదేసాయి, దినేష్‌కార్తీక్ చెన్నై బౌలర్లకు ధడపుట్టించారు. కానీ లక్ష్యం చాలా పెద్దది అయ్యేసరికి ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. చివర్‌లో టెయిలెండర్ సిరాజ్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే హెలికాప్టర్ షాట్ ఆడాడు. సిరాజ్ హెలికాప్టర్ షాట్‌ను ధోని కూడా మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగుల సాధించింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ఓడింది. మరి సిరాజ్ హెలికాప్టర్ షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శివమ్ దూబే కొట్టిన భారీ సిక్స్‌కు పగిలిన అద్దాలు!
— Rishobpuant (@rishobpuant) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.