2013 ఐపీఎల్ సీజన్ లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అందరకి గుర్తుండే ఉంటుంది. అలా స్పాట్ ఫిక్సింగ్ మకిలితో రెండేళ్లు నిషేధానికి గురై 2018లో రీఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఏడాది ఛాంపియన్స్ గా నిలిచింది. మరి ఆ సీజన్ ఆరంభంలో ఎలా ఉండేది, ఆటగాళ్లు ఎలా ఉండేవారు అన్న విషయాలపై ఆ జట్టు మాజీ ప్లేయర్, బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
2018 సీజన్ తమకు చాలా ప్రత్యేకమని చెప్పిన మైక్ హస్సీ.. ఆ విజయాన్ని తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుస్తాయని తెలిపాడు. ‘సీఎస్‌కేతో నా ప్రయాణంతో చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. అందులో గొప్పది అంటే.. 2018 సీజన్. ఎందుకంటే నిషేధం కారణంగా మేం లీగ్‌కు రెండేళ్లు(2016,17) దూరమయ్యాం. అది మాకు కమ్ బ్యాక్ సీజన్. సీజన్ ఆరంభంలో జట్టును ఉద్దేశించి ధోనీ ఇచ్చిన స్పీచ్ నాకింకా గుర్తుంది. జట్టు గురించి మాట్లాడుతూ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ధోనీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏడ్చేశాడు కూడా. ఆ క్షణం నా కళ్లలో నుంచి కూడా దుఃఖం తన్నుకొచ్చింది” అని హస్సీ చెప్పుకొచ్చాడు.
“That was a special season 2018 IPL. It gives you goosebumps just thinking about what happened that year. It was almost like it was meant to be after coming back to the IPL. MS Dhoni played Unbelievably well throughout the season. It was just a special time.” – Michael Hussey
— CricketMAN2 (@ImTanujSingh) May 6, 2022
ఇది కూడా చదవండి: Ravi Shastri: రవిశాస్త్రికి మరో క్రికెటర్ బిర్యానీ బాకీ ఉన్నాడంట!
నిషేధం ఎందుకు:
2018 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఎస్. శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లను స్పాట్ ఫిక్సింగ్‌కు పాలపడ్డారంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వెనువెంటనే రాజస్థాన్ రాయల్స్ ఓనర్ రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడం.. ముంబై పోలీసులు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపాల్ గురునాథ్ మెయ్యప్పన్ ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఘటనలతో ఉలిక్కిపడిన బీసీసీఐ వెంటనే రంగంలోకి దిగి విచారణ జరిపించింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నిజమని తేలడంతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై రెండేళ్ల(2016,2017) పాటు నిషేధం విధించింది.
July 2015, CSK and RR were suspended from the IPL for two years for betting and Spot-fixing activities of their key officials Gurunath Meiyappan and Raj Kundra during the 2013 season.
— Syed Saad (@SyedSaad9778) November 1, 2021