ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రస్థానం ముగించింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో ఓటమి పాలైంది. లీగ్ ఆసాంతం అద్భుతంగా ఆడిన లక్నో.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో విఫలమైంది. ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్ లక్నోను దారుణంగా దెబ్బతీసింది. సెంచరీతో చెలరేగిన ఆర్సీబీ యువ ప్లేయర్ పటీదార్ క్యాచ్‌ను, సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ క్యాచ్‌లను జారవిడువడం లక్నోకు శాపంగా మారింది. సునాయస క్యాచ్‌లను సైతం లక్నో ఆటగాళ్లు నేలపాలు చేశాడు. దీంతో పటీదార్, దినేశ్ కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.
170 వరకు వస్తుందనుకున్న ఆర్సీబీ స్కోర్.. 207కు చేరిందంటే కేవలం చెత్త ఫీల్డింగ్‌తోనే. ఇక ఈ ఓటమితో లక్నో మెంటర్ గంభీర్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓడిపోవడంతో సహనం కోల్పోయాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కీలక సమయాల్లో తీవ్ర భావోద్వేగానికి గురైన గంభీర్ మ్యాచ్ అనంతరం మాత్రం కోపాన్ని అదుపుచేసుకోలేకపోయాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తన ఆగ్రహ జ్వాలను కురిపించాడు. మ్యాచ్ ముగియడంతోనే కేఎల్ రాహుల్‌కు 10 నిమిషాల పాటు క్లాస్ పీకాడు.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కూడా ఒక కీలక క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో.. కార్తీక్ బంతిని ఇన్‌ఫీల్డ్ దాటించడానికి ప్రయత్నించాడు. కాగా షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి కొంచెం గాల్లోకి లేచింది. దీంతో మిడ్-ఆఫ్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే దాదాపు క్యాచ్ తీసుకున్నాడు అనుకున్న సమయంలో అఖరి క్షణంలో బంతి చేతి నుంచి జారిపోయింది. ఈ క్రమంలో డగౌట్‌లో ఉన్న లక్నో మెంటార్ గౌతం గంభీర్ తీవ్రంగా నిరాశ చెందాడు. తొలుత రాహుల్ క్యాచ్ తీసుకున్నాడని భావించి చప్పట్లు కొట్టి అభినందించిన గంభీర్.. ఆఖరి క్షణంలో క్యాచ్ నేలపాలైందని తెలుసుకుని ఒక్కసారిగా తల పట్టుకున్నాడు. ఈ కోపానంత మ్యాచ్ ముగిసిన తర్వాత చూపించినట్లు సమాచారం. లక్నోను మొదటి నుంచి అన్నీ తానై నడిపించిన గంభీర్ ఈ ఓటమి జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తుంది. గంభీర్ పీకిన క్లాస్‌కు సమాధానం లేని కేఎల్ రాహుల్ తలగొక్కుంటున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొహ్‌సిన్ ఖాన్ ఆర్సీబీని తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(0)ను తొలి ఓవర్ ఐదో బంతికి అవుట్ చేసి.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిపై, గంభీర్ కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: IPL 2022లో ఆ ప్రత్యేకమైన అవార్డును విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందేనా?