ఐపీఎల్ 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన కనబర్చి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలర్లు పంజాబ్‌ను 115 పరుగులకే కట్టడి చేస్తే.. తర్వాత ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వాస్తవానికి 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ఈ అవార్డు లభిస్తుందని అంతా భావించారు. పైగా అతను లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ వంటి కీలక వికెట్లను తీశాడు.
కానీ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ మాత్రం ఒకే ఓవర్‌లో కగిసో రబడా, నాథన్ ఎల్లిస్ వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌కు ఎంపిక చేసింది. ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరిని ఔట్ చేయడంతో ద్వారా స్లాగ్ ఓవర్లలో పంజాబ్ ధాటిగా ఆడలేక ఆలౌటయ్యిందనే పాయింట్‌లో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అవార్డు అందుకున్న కుల్దీప్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ అవార్డుకు అక్షర్ పటేల్ అర్హుడని, అతని రెండు కీలక వికెట్లు తీశాడని చెప్పాడు. ఈ అవార్డును అతనితో కలిసి షేర్ చేసుకుంటానని తెలిపాడు.
దీంతో అప్పటి వరకు అక్షర్ పటేల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ.. కుల్దీప్ అవార్డు తీసుకునే సమయంలో చెప్పిన మాటతో మొత్తం సీన్ మారిపోయింది. నెటిజన్లు కూడా కుల్దీప్ గొప్ప మనసుకు ఫిదా అయ్యి.. ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంజాబ్‌ను చిత్తు చేసిన ఢిల్లీ! IPLలో రెండో బ్యాట్స్‌మెన్‌గా వార్నర్
“I would like to share the man of the match with Axar Patel”.#kuldeepyadav #DelhiCapitals
— Sports Trumpet (@Sportstrumpet) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.