రెండు కొత్త ఫ్రాంచైజీల ఎంట్రీతో ఐపీఎల్ 2022 మరింత ఉత్కంఠగా మారబోతోంది. ఇప్పటికే మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్- 2022 మెగా వేలం నిర్వహించనున్నారు. అయితే కొత్త ఫ్రాంచైజీలకు కూడా అన్నీ టీమ్స్ లాగానే ఒక అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రిటైన్ పాలసీలాగానే ఆక్షన్ కంటే ముందే కొత్త టీమ్స్ కూడా వేలంలో ఉన్న వారిలో ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే వీలుంది. వారి ప్లేయర్లను ఎంపిక చేసుకునుందుకు జనవరి 22 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈలోపు వారు ఎవరిని కొనుగోలు చేసింది చెప్పాల్సి ఉంటుంది.
Here are the draft picks for the Lucknow-based IPL franchise.
KL Rahul to lead the team.#KLRahul #LucknowIPLTeam #IPLAuction pic.twitter.com/ZpN4NOSi6r— CricActivity (@cricactivity) January 18, 2022
లక్నో టీమ్ ఇప్పటికే తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చెప్పుకున్నట్లుగానే లక్నో టీమ్ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసుకుంది. అతనితో పాటు మార్కస్ స్టోయినిస్, బిష్ణోయ్ లను తీసుకోనున్నట్లు సమాచారం. ఇంకా కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ధ్రువీకరించడం లేదు. మరోవైపు కేఎల్ రాహుల్ లక్నో టీమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. యాజమాన్యంతో ఉన్న బేధాభిప్రాయాలతో రాహుల్ వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే. లక్నో సెలక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.