ఐపీఎల్ 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ ఐదో విజయం సాధించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. 62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 103 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్‌కు రూ.24 లక్షల భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు అతడికి ఫైన్ విధించారు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌లో నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయకపోవడం లక్నోకు ఇది రెండోసారి. అందుకే కెప్టెన్ రాహుల్‌కు జరిమానా విధించారు.
ఇంతకుముందు ఒక మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇది రెండోసారి కావడంతో రూ.24 లక్షలు వేశారు. మరోసారి స్లోఓవర్ రేట్ నమోదు చేస్తే.. కేఎల్ రాహుల్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు సార్లు స్లో ఓవర్ రేట్ జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రాహుల్‌కు రెండోసారి జరిమానా పడింది. లక్నో బ్యాటింగ్ లైనప్‌లో చాలా నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌పై మ్యాచ్ నిషేధం విధిస్తే.. జట్టు ప్రదర్శన తీవ్ర ప్రభావం చూసే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐపీఎల్ నుంచి తమతో పాటు CSKనూ తీసుకెళ్లిన ముంబై
CENTURY for @klrahul11 👏👏
His second in #TATAIPL 2022 pic.twitter.com/GPTGfKHKYl
— IndianPremierLeague (@IPL) April 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.