ఐపీఎల్ 2022లో అంపైర్ల తప్పిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అవుట్ నుంచి మొదలు.. ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. సోమవారం(మే 2) రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌లు తీసుకున్న నిర్ణయాల పట్ల అభిమానులు మండిపడుతున్నారు. క్యాచ్ అవుట్‌ను సైతం వైడ్‌గా ప్రకటించారు అంపైర్లు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సీరియస్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్‌లో బౌల్ట్ వేసిన షాట్ బాల్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీనితో సంజు, ట్రెంట్ బౌల్ట్ సంబరాలు చేసుకోబోతుండగా.. అంపైర్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. అది వైడ్ బాల్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే సంజూ రివ్యూ తీసుకోగా.. రీప్లే లో క్లియర్‌గా గ్లోవ్స్‌ను తాకినట్లు కన్పించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కితీసుకొని క్యాచ్ అవుట్‌గా ప్రకటించాడు.
#Samson pic.twitter.com/GMlUZyGpDE
— Vaishnavi Sawant (@VaishnaviS45) May 2, 2022
ఇది కూడా చదవండి: MS Dhoni: మైండ్ దొబ్బిందా? ఏం బౌలింగ్ వేస్తున్నావ్? బౌలర్ పై ధోని సీరియస్!
ఇది ఇలా ఉండగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో హై డ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ చివరి బాల్ ను షార్ట్ బాల్‌గా సంధించాడు. అది కాస్తా అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడంతో.. రాజస్తాన్ కెప్టెన్ శాంసన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ డ్రామా అంతటితో ముగిసిపోలేదు. ఓవర్ అఖరి బంతికి స్టైక్‌లో ఉన్న రాణాకు ప్రసిద్ధ్ వైడ్ యార్కర్ వేశాడు. అయితే బంతికి రానా బ్యాట్‌ను చాలా దగ్గరగా వెళ్లింది. అనూహ్యంగా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దీంతో మరోసాని ఆసహానానికి గురైన కెప్టెన్ సంజూ అంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Gamechanger of the match and
Player of the match is Umpire today for Kkr#umpiring #umpire #nitinmenon #TATAIPL #RRvKKR #SanjuSamson #KKRvRR #IPL2022 #umpire @rajasthanroyals @IrfanPathan @bhogleharsha @IamSanjuSamson @ashwinravi99 @yuzi_chahal @MohammadKaif @cricketaakash pic.twitter.com/sHgAU8fsgI— nikhil patel (@nikhilpatel4716) May 2, 2022
Shameless @BCCI backing these umpires who are not even qualified for Galli Cricket #KKRvRR #umpiring pic.twitter.com/aK96NHwRUo
— Mukesh Choudhary (@Mukesh3345) May 2, 2022
ఇక.. ఈ మ్యాచుతో ఓ కొత్త డిమాండ్ కూడా పుట్టుకొచ్చింది. ఇకపై వైడ్ బాల్స్‌ను గుర్తించడానికి డీఆర్ఎస్ విధానాన్ని అనుసరించడం మేలంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరి చెప్పాడు. వైడ్ బాల్స్ విషయంలో అంపైర్ల నిర్ణయాలను పునఃసమీక్షించడానికి డీఆర్ఎస్ విధానాన్ని వర్తింపజేయడమే మంచిదని చెప్పుకొచ్చాడు. ఐసీసీ రూల్స్ 22.4.1 ప్రకారం వైడ్ బాల్స్‌ను గుర్తించడానికి స్పష్టమైన విధానం ఉందని, అంపైరింగ్ తప్పిదాలు మళ్లీ మళ్లీ చోటుచేసుకుంటూనే ఉంటున్నాయని వ్యాఖ్యానించాడు. అందుకే- డీఆర్ఎస్ విధానాన్ని వైడ్ బాల్స్‌కు కూడా వర్తింపజేయడం వల్ల పరిష్కారం దొరుకుతుందని తెలిపాడు.