వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. అనంతరం కేకేఆర్ 5 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ బౌలర్ ప్రసిద్ కృష్ణ.. వికెట్లకు త్రో వేద్దామనుకొని.. బౌలర్ కేసి కొట్టాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో.. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో ఓవర్ ట్రెంట్ బౌల్ట్ వేయగా.. కేకేఆర్ బ్యాటర్ బాబా ఇంద్రజిత్ మిడాన్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఇంద్రజిత్, ఫించ్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ కృష్ణ వెంటనే బంతిని అందుకుని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రో చేసిన బంతి నేరుగా ట్రెంట్ బౌల్ట్ బూట్‌కు తగిలింది. దీంతో దెబ్బకు బౌల్ట్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడపోయాడు. నవ్వాలో ఏడవాలో తెలియక బౌల్ట్ అదోరకంగా మొహం పెట్టాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Eden Watson (@EdenWatson17) May 2, 2022
ఇది కూడా చదవండి: Rinku Singh: పొట్టకూటి కోసం స్వీపర్‌గా పని చేసిన కేకేఆర్ యువ క్రికెటర్!
కాగా ప్రసిద్ చేసిన పనికి బౌల్ట్‌తో పాటు సహచర ఆటగాళ్లు కాసేపు నవ్వుకున్నారు. జోస్ బట్లర్.. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకున్నాడు. మరో ఫీల్డర్ హెట్మెయిర్.. నవ్వాలో ఏడ్వాలో తెలీని స్థితిలో కనిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The man of the hour 💜💛@rinkusingh235 #KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/dpynqzyrgf
— KolkataKnightRiders (@KKRiders) May 3, 2022
English tuition feat. Teacher @ShreyasIyer15 and Student @rinkusingh235 👨🏫
“You’re going to be a key player for KKR in future, so let’s help you build more confidence for interviews”#KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/vrug4lN4H7
— KolkataKnightRiders (@KKRiders) May 3, 2022