ఐపీఎల్ 2022లో బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కోత్తా నైట్ రైడర్స్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలైన టీ20 మజాను క్రికెట్ అభిమానులకు పంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. 210 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా మ్యాచ్ చివరి బంతి వరకు కూడా పోరాడి.. చచ్చి గెలిచింది. లక్నో నిర్ధేశించిన 211 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. మొహ్సిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లో వెంకటేష్ అయ్యార్ డకౌట్ అయ్యాడు. కీపర్ డికాక్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో అయ్యర్ పెవిలియన్ చేరాడు. ఇక 3వ ఓవర్లో కేకేఆర్‌పై మరో దెబ్బ పడింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అభిజిత్ తోమర్(4) క్యాచ్ అవుట్ అయ్యాడు.
రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ కేకేఆర్ బ్యాటర్లు నితీష్ రానా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడారు. అవేష్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో నితీష్ రానా 4 ఫోర్లు కొట్టి మొత్తం 21పరుగులు పిండుకున్నాడు. హోల్డర్ వేసిన 5వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. గౌతమ్ వేసిన 6వ ఓవర్లోనూ నితీష్ రానా మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఇక ప్రమాదకరంగా మారుతున్న వీరి ఓడిని గౌతమ్ విడగొట్టాడు. నితీష్ రాణాను అవుట్ చేశాడు. వికెట్ పడ్డా కూడా శ్రేయస్ అయ్యార్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. బిల్లింగ్స్‌తో కలిసి టార్గెట్ దిశగా ఇన్నింగ్స్ నడిపించాడు.
10వ ఓవర్లో సామ్ బిల్లింగ్స్ రెచ్చిపోయాడు. ఆవేష్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. తర్వాతి బిష్ణోయ్ వేసిన 11ఓవర్లోనూ 16పరుగులొచ్చాయి. 13ఓవర్లు పూర్తయ్యేసరికి 42 బంతుల్లో 84పరుగులు చేయాల్సిన స్థితి నెలకొంది. కానీ 14ఓవర్ 4వ బంతికి హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యార్ హిట్టింగ్‌కు ప్రయత్నించి హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత 16వ ఓవర్లో సామ్ బిల్లింగ్స్ ఔట్ కావడం, 17వ ఓవర్లో మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో రస్సెల్ (5పరుగులు 11బంతుల్లో) బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ కావడంతో అందరూ కేకేఆర్ ఓటమి ఖాయమనుకున్నారు. కానీ సునీల్ నరైన్, రింకూసింగ్ వీరోచితంగా పోరాడారు. వీరిద్దరు సిక్సర్లు, ఫోర్లతో లక్నో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు.
18 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన తరుణంలో అవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో రింకూ ఒక సిక్సర్, నరైన్ ఒక సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో 17పరుగులొచ్చాయి. తర్వాత హోల్డర్ బౌలింగ్లోనూ రింకూ, నరైన్ చెరో సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లోనూ 17పరుగులొచ్చాయి. దీంతో చివరి ఓవర్లో 21పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టైంలో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో వరుసగా 4, 6, 6, బాదాడు. దీంతో 3బంతుల్లో 5పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రింకూ రెండు రన్స్ తీశాడు. 5వ బంతికి రింకూ హిట్టింగ్ చేయగా.. హాఫ్ సెడ్లో బంతి గాల్లోకి లేచింది. ఇక బౌండరీ వద్ద ఉన్న లూయిస్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రింకూసింగ్ పోరాటంతో పాటు ఈ సీజన్‌లో కేకేఆర్ కథ కూడా ముగిసింది. చివరి బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో కేకేఆర్ 2 పరుగుల తేడాతో ఓడింది. ఇలా లూయిస్ పట్టిన ఒక్క క్యాచ్‌తో కేకేఆర్ సూపర్ విక్టరీకి దూరమైంది. మరి ఈ మ్యాచ్‌లో రింకూ బ్యాటింగ్, లూయిస్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Quinton de Kock: కోల్‌కత్తాను చితక్కొట్టిన క్వింటన్ డికాక్! ముంబై ఫ్రాంచైజ్‌పై ఫ్యాన్స్ ఫైర్
Take A Bow..Rinku Singh.🔥#IPL2022 #KKRvLSG pic.twitter.com/Y2Fi2r3kmS
— RVCJ Media (@RVCJ_FB) May 18, 2022