ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ముంబై జట్టు బౌలింగ్ విభాగానికి వెన్నుముకగా నిలిచే జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 200 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించినా.. కేవలం 165 పరుగులకే సరిపెట్టుకుంది అంటే అది కేవలం బుమ్రా మ్యాజిక్‌తోనే. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో 18 మెడిన్‌తో పాటు మూడు వికెట్లు, 20వ ఓవర్‌లో కేవలం ఒక్క రన్ మాత్రమే ఇచ్చి.. కేకేఆర్‌కు చుక్కలు చూపించాడు.
విధ్వంసకర బ్యాటర్ ఆండ్రూ రస్సెల్‌తో తన వేట మొదలుపెట్టిన బుమ్రా.. ఫామ్‌లో ఉన్న నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్‌లను అవుట్ చేసి కేకేఆర్ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. బుమ్రా వేసిన ఈ స్పెల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుంతమైన సెల్స్‌లో ఒకటి. 15వ ఓవర్ వరకు పటిష్టస్థితిలో ఉన్న కేకేఆర్.. బుమ్రా దెబ్బకు విలవిల్లాడింది. కానీ.. కేకేఆర్ బౌలర్లు కూడా చెలరేగడంతో ముంబై ఇండియన్స్ 113 పరుగులకే ఆలౌట్ అయి.. తొమ్మిదో పరాజయం చవిచూసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 43 పరుగులు చేసి రాణించాడు. నితీష్ రాణా కూడా 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు కొట్టి 43 పరుగులు చేశాడు.మంచి స్టార్ట్, 10 రన్స్‌పర్ ఓవర్‌తో 200 పరుగులు చేసేలా కనిపించిన కేకేఆర్ బుమ్రా దెబ్బకు చివర్లో పరుగులు చేయలేకపోయింది. ఇక 166 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 17.3 ఓవర్లలోనే 113 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. 52 పరుగుల తేడాతో మంచి విజయం సాధించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరి బుమ్రా బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: ఇదేం చెత్త అంపైరింగ్ రా బాబు! రోహిత్‌ను వెంటాడుతున్న దురదృష్టం
FIFER FOR JASPRIT! 🤯🤯🤯🤯🤯 https://t.co/bBAUMY4eGz pic.twitter.com/rgJnMVO0l5
— Mumbai Indians (@mipaltan) May 9, 2022
Not on the winning side but Jasprit Bumrah was adjudged the player of the match for his fiery spell👏
📸: IPL/BCCI pic.twitter.com/7PXet31oh1
— CricTracker (@Cricketracker) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.