ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి పొందింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరిచాడు. 20 బంతులాడిన కిషన్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఒక బౌండరీ కూడా కొట్టలేదు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మినహా ఇస్తే.. ఇషాన్ కిషన్ అత్యంత దారుణంగా విఫలం అయ్యాడు.
చివరి ఆరు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ చేసిన పరుగులు మొత్తం కలిపి 64. ఇది అతని ఫెల్యూయిర్‌ను స్పష్టంగా ప్రతిబింభిస్తుంది. నిజానికి ముంబై ఇండియన్స్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ముంబై చరిత్రలోనే ఇంత భారీ మొత్తం వేలంలో ఏ ఆటగాడి కోసం పెట్టలేదు. తనపై ఇంత ‘భారీ’ నమ్మకం పెట్టుకున్న ముంబైను కిషన్ తొలి రెండు మ్యాచ్‌లలో నిరాశపర్చలేదు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో 81 పరుగులు చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో 54 పరుగులతో రాణించాడు. కానీ.. ఆ తర్వాత నుంచి దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో అతను జట్టుకు భారంగా మారాడు.లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడింది. వాంఖడే పిచ్‌పై 169 పరుగుల టార్గెట్ ఛేదించడం అంత కష్టమేమీ కాదు. కానీ.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ముంబై మ్యాచ్ గెలవలేదు అంటే కచ్చితంగా బ్యాటర్లు విఫలం అయ్యారనే చెప్పాలి. అందులోనూ ఓపెనర్‌ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదర్కొని కేవలం 8 పరుగుల చేశాడు. ఇలా తన పూర్ ఫామ్‌తో ముంబై ఇండియన్స్ ఫెల్యూయిర్స్‌లో ఇషాక్ కిషన్ ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. దీంతో ఇషాక్ కిషన్‌పై ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అతి నమ్మకం పెట్టుకుందని ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బై బై.. ముంబై! వరుసగా 8వ ఓటమి.. కొంపముంచిన వేలం
Ishan kishan hitting boundaries 🔥 🥵 #MIvsLSG #MumbaiIndians #ishankisan pic.twitter.com/bwooOAdstE
— Swapna Maheswari (@SwapnaMaheswari) April 24, 2022
when u give 15cr to wife for shopping and she buys ishan kishan pic.twitter.com/OsZ6zxoTNP
— tipu sir_ 53.78_ (@onetiponehand_) April 21, 2022
when u give 15cr to wife for shopping and she buys ishan kishan pic.twitter.com/OsZ6zxoTNP
— tipu sir_ 53.78_ (@onetiponehand_) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.