ప్రపంచ క్రికెట్ లో ‘ఐపీఎల్’ టోర్నీ ఎంత ఫేమస్సో.. యూనివర్సల్ బాస్ ‘క్రిస్ గేల్’ అంతే ఫేమస్. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్ కు ఇంత క్రేజ్ రావడానికి ‘యూనివర్సల్ బాస్’ కూడా ఓ కారణమే. ఐపీఎల్ మెగా టోర్నీలో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడిన గేల్.. సిక్సర్లు బాదడంలో, అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. అన్ని సీజన్లలో అభిమానులను ఎంటర్టైన్ చేసిన గేల్.. 15వ సీజన్ లో మాత్రం ఆడట్లేదు. కనీసం మెగా వేలంలోనూ పాల్గొనలేదు. అతడు ఎందుకు వేలంలో పాల్గొనలేదో అప్పట్లో కారణం చెప్పని గేల్ తాజాగా ఆ కారణాన్ని వెల్లడించి.. ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గేల్.. బయోబబుల్ కారణంగా లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. దీంతో గేల్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని అందరూ భావించారు. అయితే.. గేల్ తాను ఐపీఎల్ 2022 సీజన్ లో ఎందుకు ఆడట్లేదో అసలు విషయాన్ని బయటపెట్టాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు. ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. ”గత రెండేళ్లుగా ఐపీఎల్ లో నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఐపీఎల్‌లో ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో బాధ కలిగింది” అని తెలిపాడు.
Chris Gayle explains why he didn’t enter the #IPL2022 auction 👀 pic.twitter.com/MGVOk2Dhr2
— ESPNcricinfo (@ESPNcricinfo) May 7, 2022
ఇది కూడా చదవండి: Virender Sehwag: వార్నర్ కు అందరితో గొడవలే.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
“క్రికెట్ తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది.. అందుకే ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకున్నా. ఎవరిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకనే వేలంలోనూ పాల్గొనలేదు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది. ఏ జట్టుకు ఆడుతానో తెలియదు కానీ.. నా అవసరం సదరు జట్టుకు కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, కోల్‌కతా, పంజాబ్‌లకు ఆడినప్పటికి.. ఆర్సీబీ, పంజాబ్‌కు ఆడినప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ఆర్సీబీతో నా అనుబంధం చాలా గట్టిది. కానీ, ఆర్సీబీ జట్టుకు టైటిల్ అందించలేకపోవడం కాస్త బాధ కలిగించింది. కానీ ఐపీఎల్‌లో నా అత్యధిక స్కోరు ఆ జట్టు తరపునే సాధించడం సంతోషం” అని చెప్పుకొచ్చాడు.
Green Jersey Flashback
37 Runs in an OverChris Gayle supremacy pic.twitter.com/p6imkNA4Ly
— SG 👑 (@RCBSG30) May 8, 2022
ఇక ఐపీఎల్‌లో గేల్ ట్రాక్ రికార్డు మాములుగా లేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 149 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండడం విశేషం. మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు గేల్ పేరిటే ఉంది. ఆర్‌సీబీ తరపున 2013లో పుణే వారియర్స్‌పై గేల్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరలేదు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఎవరూ అందుకోలేరేమో. ఐపీఎల్లో 357 సిక్స్‌లు బాదిన గేల్.. ఈ ఘనత అందుకున్న ఏకైక బ్యాటర్‌గా కూడా రికార్డుల్లో ఉన్నాడు.
Season wise stats of Chris Gayle pic.twitter.com/ksuR17gXk6
— Vinay (@VinayKushwaha94) May 7, 2022
#OnThisDay in 2013, Chris Gayle smashed the highest individual score in T20 cricket 😯
His 175* off just 66 balls consisted of 13 fours and 17 sixes 💥 pic.twitter.com/MtX6kuwKcv
— ICC (@ICC) April 23, 2021