ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ వివాదంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చివరి ఓవర్లో ఢిల్లీ 36పరుగులు చేయాల్సిన పరిస్థితి.. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌కు దిగాడు. క్రీజులో ఢిల్లీ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ ఉన్నాడు. మెక్‌కాయ్ వేసిన మొదటి బంతికి పావెల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. రెండో బంతికి కూడా సిక్సుతో బదులిచ్చాడు. దీంతో సమీకరణం 4 బంతులకు 24 పరుగులకు చేరుకుంది.
పావెల్ విరుచుకుపడుతుండడంతో బౌలర్ మెక్‌కాయ్ బౌలింగ్లో లయ తప్పాడు. మూడో బంతిని ఫుల్ టాస్‌గా విసిరాడు. దాన్ని కూడా పావెల్ గుంజి కొట్టడంతో బంతి స్టాండ్స్‌లో పడింది. వరుసగా ఢిల్లీకి మూడు సిక్సర్లు రావడంతో 3బంతుల్లో 18పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడే వివాదం రాజుకుంది. మూడో బంతి ఫుల్ టాస్.. బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్‌తో వాదించాడు.కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు. దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు. పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇంతలో షేన్ వాట్సన్ పంత్‌ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే తన లయ దెబ్బతిన్న పావెల్ తర్వాతి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టలేదు. ఆఖరి బంతికి ఔటయిపోయాడు. దీంతో రాజస్థాన్ గెలిచింది. కానీ.. ఈ ఘటన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. రిషభ్ పంత్ ప్రవర్తన ఏ మాత్రం హర్షనీయం కాదంటూ మాజీ క్రికెటర్లు పంత్‌పై మండిపడ్డారు. అలాగే పంత్ చేసిన పనిపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జడేజా- సూర్య వీడియో!
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.