టీమిండియా ఆల్‌రౌడర్ హార్థిక్ పాండ్యా.. ఐపీఎల్ – 2022లో ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. ఒకపైపు గాయాల బెడద, మరోవైపు ఫామ్ లేక ఇబ్బందిపడిన హార్దిక్, జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఆల్ రౌండర్ గా మంచి పేరున్నప్పటికీ బౌలింగ్ వేయడమే మానేశాడు. పోనీ బ్యాటింగులోనైనా రాణిస్తాడనుకుంటే.. ఆడింది లేదు. దీంతో జట్టు నుంచి తప్పించారు. వీటన్నిటిని మనుసులో దాచుకున్న హార్దిక్.. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టె గా బరిలోకి దిగాడు. పడిలేచిన కెరటంలా, అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతూ గుజరాత్ జట్టును విజయాల బాటలో తీసుకెళ్తున్నాడు. తాజాగా.. గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకితో జరిగిన సంభాషణలో పాల్గొన్న హార్దిక్.. జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాడో తన మనసులో మాటను బయటపెట్టాడు.
టీమిండియాకు ఆడేటప్పుడు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ కు దిగే హార్దిక్.. 3స్థానంలో బ్యాటింగ్ దిగే విషయం గురించి హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘2016లో నేను ముంబై ఇండియన్స్ కు ఆడేటప్పుడు 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. కానీ అప్పుడు నా టైం బ్యాడ్ ఉంది, అంతగా రాణించలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోను. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌లో నేను ఆ స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. సరైన సమయంలో బ్యాటింగ్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శుభమాన్ గిల్ ఔట్ అయ్యాక నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. ఒక వేళ నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు గిల్ క్రీజులో ఉంటే.. అప్పడు నా బ్యాటింగ్ కాస్త దూకుడుగా ఉంటుంది. ఒక వేళ అతడు తొందరగా ఔటైతే.. గిల్ బాధ్యతను నేను తీసుకుంటాను” అని హార్థిక్ పాండ్యా పేర్కొన్నాడు.
6 innings, 295 runs @ 73.75, 3 fifties 🔥
Captain Hardik Pandya has been brilliant with the bat for GT in IPL 2022 💥👏#HardikPandya #GT #IPL2022 #Cricket Courtesy – @WisdenIndia pic.twitter.com/oPFCgA4BNd
— Cricket and other things. (@ArhatAarya) April 26, 2022
ఇది కుడి చదవండి: IPL వేలం గురుంచి ఆసక్తికర కామెంట్స్ చేసిన హర్షల్ పటేల్!
ఈ సీజన్ మొదటి 5 మ్యాచుల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్, మంచి ఇన్సింగ్స్‌లు ఆడుతూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తరువాత చెన్నైతో జరిగిన మ్యాచులో బరిలోకి దిగలేదు. ఇక.. కేకేఆర్ తో జరిగిన మ్యాచులో 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా 67 పరుగులతో రాణించాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హార్దిక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆడిన 6 మ్యాచ్‌లలో 73.75 సగటుతో 295 పరుగులు చేశాడు. ఇక.. గుజరాత్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది.
This is amazingly interesting @ImRaina @hardikpandya7 @gujarat_titans @SunRisers #IPL2022 #IPL pic.twitter.com/gG8zmqwxZt
— Gourav (@badshazzgaurav) April 26, 2022
Runs Scored by Captains in IPL 2022.🔥😍#ipl #IPL2022 #TATAIPL2022 #RohitSharma #KLRahul #mayankagarwal #SanjuSamson #fafduplesis #RavindraJadeja #HardikPandya #kanewilliamson #shreyasiyer #RishabhPant pic.twitter.com/vua5dxdK2C
— Cricfacts (@CricfactsSports) April 26, 2022
హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. టీమిండియాలో 3వ స్తానం కోహ్లీది. ఆ స్థానంలో బ్యాటింగ్ కు దిగే కోహ్లీ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ‘నువ్ ఆడే ఆటకు కోహ్లీ ప్లేస్ కావాలా’ అంటూ కోహ్లీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.