ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం(ఏప్రిల్ 30) డబుల్ ధమాకా ఉండనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ బెంగళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచులో స్ట్రాటజిక్ టైం అవుట్ సమయంలో జరిగిన ఒక సంఘటన తెగ వైరలవుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0)ను సంగ్వాన్ డకౌట్ చేశాడు. దీంతో మరోసారి బెంగళూరు బ్యాటింగ్ కుప్పకూలుతుందని అంతా భావించారు. అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 నాటౌట్), రజత్ పటీదార్ (47 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. గడిచి రెండు మ్యాచుల్లో డకౌట్ వెనుదిరిగిన విరాట్ కోహ్లి ఈ మ్యాచులో తన జోరును కొనసాగిస్తున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంతో ఆర్సీబీ 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. ఈ క్రమంలో స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకోగా.. మొదటి మ్యాచ్ కావడంతో ఎండకు కోహ్లీ బాగా అలసిపోయాడు. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్ నుంచి గొడుగు పట్టుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: Virat Kohli: అవసరమైతే కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెడతాం: గంగూలీ
— K I N G (@KingKalyanPK) April 30, 2022
ఈ సీజన్ తో తొలిసారి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఆడిన 8 మ్యాచుల్లో 7 విజయాలతో(14 పాయింట్లు) పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఆర్సీబీ 9 మ్యాచుల్లో 5 విజయాలతో 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆర్సీబీ భావిస్తుండగా.. మరో విజయం సాధించి అగ్రస్థానం పదిలపరుచుకోవాలని గుజరాత్ చూస్తోంది. చూడాలి మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో.