మంగళవారం(మే 3) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ సీజన్‌లోనే భారీ సిక్సర్(117 మీటర్లు) నమోదు చేశాడు. ఈ క్రమంలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్, లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ దశలో అంటే మ్యాచ్ చివర్లో 30 బంతుల్లో 27 పరుగులు కావల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మొహమ్మద్ షమీ వేసిన 16వ ఓవర్ లో వరుసగా 6, 6, 6, 4, 2, 4.. ఇలా ఒకే ఓవర్ లో 28 పరుగులు చేసి మ్యాచ్ ముగించాడు. ఈ ఓవర్‌లోనే తొలి బంతిని 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు లివింగ్‌స్టోన్. ఈ క్రమంలో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. లివింగ్‌స్టొన్ దగ్గరికి వెళ్లి బ్యాట్‌ను పరిశీలించాడు. “ఇందులో స్ప్రింగులు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా ఉందా? అన్నట్లు రెండుమూడు సార్లు బ్యాట్‌ను తట్టి మరీ చెక్ చేశాడు”. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లివింగ్‌స్టొన్ భారీ సిక్స్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ” ఒకటి, రెండు భారీ సిక్సులు అంటే పర్లేదు.. కానీ, లివింగ్‌స్టొన్ కొట్టిన ప్రతి షాట్ భారీ సిక్స్ ఎలా వెళ్తోంది” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా.. లివింగ్‌స్టొన్ బ్యాట్ లను ఐసీసీ ఒకసారి చెక్ చేయాలని సూచిస్తున్నారు.
Rashid Khan went on to check if there is spring in Livingstone’s bat after that monstrous six 🤭😂 pic.twitter.com/u1dRy57wP0
— 웃 (@iHarshaRoyal) May 4, 2022
Spring? Rashid Khan Checking Liam Livingstone’s Bat After Shami Over Amuses IPL Fans Rashid Khan thought what everyone was thinking: Is there a spring in Liam Livingstone’s bat? #LatestNews by #News18 https://t.co/4LDxncvppC
— Market’s Cafe (@MarketsCafe) May 4, 2022
Rashid Khan literally went on to check if there is spring or something in Livingstone’s bat after that monstrous six. 🤣
— Shivani Shukla 🏏 (@iShivani_Shukla) May 3, 2022
ఇది కూడా చదవండి: IPL 2022 Playoffs Schedule: IPL 2022 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల
ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్స్‌ను కొట్టిన ఘనత దక్షిణాఫ్రికా క్రికెటర్ అల్బే మోర్కెల్ దే. మోర్కెల్ కొట్టిన షాట్‌కు బంతి 125 మీటర్ల దూరం వెళ్లి పడింది. ఆ తరువాత ప్రవీణ్ కుమార్ 124 మీటర్లు, ఆడమ్ గిల్‌క్రిస్ట్-122, రాబిన్ ఉతప్ప-120, క్రిస్ గేల్-119, యువరాజ్ సింగ్-119, రాస్ టేలర్-119, లివింగ్‌స్టొన్-117, గౌతమ్ గంభీర్-117, బెన్ కట్టింగ్-117, ఎంఎస్ ధోని – 115 మీటర్ల దూరానికి సిక్స్ కొట్టారు.
Longest Sixes in IPL history:
125m – A Morkel,2008
124m – Praveen,2011
122m – Gilchrist,2011
120m – Uthappa,2010
119m – Gayle,2013
119m – Yuvraj,2009
119m – R Taylor,2008
117m – Cutting,2016
117m – Gambhir,2017
117m – Livingston,2022*(Today)#IPL2022 #GTvsPBKS #CricketTwitter— Rahul Choudhary (@Rahulc7official) May 3, 2022
Liam Livingstone dominating the biggest sixes department. Tonight’s 117M six was one of the biggest ever six of IPL history. pic.twitter.com/3RlLXkAq4G
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2022