ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(మే 30) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ మహ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. సీజన్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు.
ఓ దశలో అంటే చివర్లో 30 బంతుల్లో 27 పరుగులు కావల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న మొహమ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. వరుసగా 6, 6, 6, 4, 2, 4.. ఇలా ఒకే ఓవర్ లో 28 పరుగులు చేసి మ్యాచ్ ముగించాడు. ఈ ఓవర్‌లోనే తొలి బంతిని 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు లివింగ్‌స్టోన్. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ 2022లోనే లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ 112 మీటర్ల భారీ సిక్స్ బాదాడు.
117m SIX by Liam Livingstone. This was quite a hit. @liaml4893 #IPL2022 @IPL
— Waadaplaya!!! 🏏 #IPL2022 (@waadaplaya) May 4, 2022
Most runs by a batter in an over in #IPL2022–
34 – Cummins vs D Sams
28 – Livingstone vs Shami*** 👈
28 – D Karthik vs Mustafizur
28 – Brevis vs R Chahar
26 – Buttler vs Thampi#TATAIPL— The Third Man Cricket Show (@ThirdCricket) May 3, 2022
ఇది కూడా చదవండి: KKR vs RR: వీడియో: ప్రసిద్ కృష్ణ వెరైటీ త్రో.. వికెట్లకు కాకుండా బౌల్ట్ మీదకు!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. సాయి సుదర్శన్ 64 పరుగుల తప్ప మరెవరూ నిలవలేకపోయారు. రబడ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ విలవిల్లాడింది. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 62 పరుగులు చేయగా, లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
Longest sixes hit in #IPL2022:
𝟏𝟏𝟕 𝐦 – 𝐋𝐢𝐚𝐦 𝐋𝐢𝐯𝐢𝐧𝐠𝐬𝐭𝐨𝐧𝐞
112 m – Dewald Brevis
108 m – Liam Livingstone
107 m – Jos Buttler
106 m – Liam Livingstone
Six-hitting machine @liaml4893 can sure hit them big 🤯#IPL2022 #GTvPBKS #aviparihar1 pic.twitter.com/KwGdWI36bO— Shakti Singh Parihar (@aviparihar1) May 4, 2022