ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ‘గుజరాత్ టైటాన్స్’ తొలి సీజన్‌లోనే ఊహించని ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ మ్యాచులు ముగిసేసరికి టేబుల్ టాపర్‌గా.. ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్, క్వాలిఫైయర్ 1, ఫైనల్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తు చేసి.. ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్‌రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు. అటు కెప్టెన్‌గా రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్‌లో 34 పరుగులు చేసి జట్టును విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యా భార్య నటాషా భావోద్వేగానికి లోనయ్యారు.
గుజరాత్ జట్టు పైనల్స్ లో గెలుపొందగానే మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన నటాషా.. భావోద్వేగంతో హార్దిక్ ను కౌగిలించుకున్నారు. తన భార్య తనను కౌగిలించుకున్న సమయంలో హార్ధిక్ కళ్లలో కూడా భావోద్వేగం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు విజయానంతరం హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ, ఈ ఐపీఎల్ టోర్నీలో తాను ప్రశాంతంగా ఉండి, ఇంతగా రాణించడానికి తన భార్య, కొడుకే కారణమని చెప్పాడు.
— Ashok (@Ashok94540994) May 29, 2022
సీజన్ ప్రారంభానికి ముందు పాండ్యాపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఫామ్‌లేక జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాడు.. కెప్టెన్‌గా జట్టును ఏం నడిపించగలడంటూ పలువురు అవమానించారు. ఆ సమయంలో పాండ్యాకు తన భార్య నటాషా స్టాంకోవిక్ అండగా నిలబడింది. తన కొడుకు అగస్త్యతో కలిసి గుజరాత్ టైటాన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరై ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. హార్దిక్ ఔటైన రోజున ముఖం మాడ్చుకోవడం.. అతను విజృంభించిన రోజున పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేయడం.. ఇలా తన చర్యలతో సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఫైనల్లో తన భర్త కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు బౌలింగ్‌లోనూ.. మెరవడంతో నటాషా ఊరుకుంటుందా.. అందుకే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ గెలవగానే గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి పాండ్యాను గట్టిగా హగ్ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
CHAMPIONS 🏆 This is for all the hard work we’ve put in! Congratulations to all the players, staff, fans ❤️❤️❤️ @gujarat_titans pic.twitter.com/zEeqdygBEy
— hardik pandya (@hardikpandya7) May 29, 2022
ఐపీఎల్-2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
రాజస్తాన్ స్కోరు: 130/9 (20)
గుజరాత్ స్కోరు: 133/3 (18.1)
విజేత: గుజరాత్ టైటాన్స్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు)