టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేజింగ్‌లోనే ఎక్కువ విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమిపాలైంది.
లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిన నాలుగు సార్లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఆర్‌సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1లో కూడా గుజరాత్ టాస్ గెలిచి చేజింగ్‌నే ఎంచుకుంది. ఇలా గుజరాత్ ట్రాక్ రికార్డు తెలిసి, ఫైనల్‌లో టాస్ కీలకమనే విషయం గురించి అవగాహన ఉండి కూడా.. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే అందర్ని ఆశ్చర్యపరిచాడు. పిచ్ డ్రైగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు. అయితే వికెట్ మాత్రం పేసర్లకు అనుకూలంగా ఉందని మ్యాచ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే స్పష్టంగా అర్థమైంది. అనూహ్య బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పిచ్‌పై సంజూ బ్యాటింగ్ ఎంచుకోవడంపైనే నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా విక్టరీ సింబర్ చూపించడం కూడా ఫిక్సింగ్‌లో భాగమేనని తెలుపుతున్నారు. ఆయన విక్టరీ సింబల్ చూపిన ప్రతిసారీ వికెట్ పడటం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్థిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్థిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022 ఫైనల్ కోసం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ జెర్సీ.. బీసీసీఐ గిన్నిస్ రికార్డు!
I think match fixing happening in this final ipl 2022..
— Anandhu s (@Anandhu03101472) May 29, 2022
Full match fixing IPL final 2022
— Singh Sandeep (@SinghAnkesh0000) May 29, 2022
#IPL Final 2022 Fixing #RRvsGT …..#AmitShah #NarendraModi #AshokGehlot #SanjuSamson #ChampionsLeagueFinal #RajasthanRoyals
— Pushpendra Singh Rathore (@Pushpen23136793) May 29, 2022
GT wins by Match fixing….
Normally, it has to be RR turn to win…But bcos of match fixing… GT wins
As I said at start of IPL 2022 matches….GT reached final..
Bcos Our PM is from Gurjat…
— Naveen Malekala (@naveenmalekala) May 29, 2022