ఐపీఎల్ 2022లో శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలు కొంత క్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో ఆల్‌రౌండర్ జెసన్ హోల్డర్, పంజాబ్ బౌలర్ రాహుల్ చహార్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
8 బంతుల్లో 11 పరుగులు చేసిన హోల్డర్ చహార్ బౌలింగ్‌లో సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ దొరికిన ఆనందంలో సంబరాలు చేసుకుంటున్న చహార్‌పై హోల్డర్ నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. హోల్డర్ చహార్ బౌలింగ్ అవుట్ అయ్యే బంతికంటే ముందు ఒక భారీ సిక్స్ కొట్టాడు. దీంతో సిక్స్ తర్వాత హోల్డర్ వికెట్ తీయడంతో చహార్ మరింత ఆనందంలో ఉన్నాడు. చహార్ సెలబ్రేషన్‌కు ఒళ్లుమండిన హోల్డర్.. అతన్ని ఏదో అనుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్‌లో ఆటగాళ్లు సహనం కోల్పోయి ఆగ్రహానికి గురి కావడం ఎక్కువగా జరుగుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దీపక్ హుడా(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లతో చెలరేగగా రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఓ వికెట్ తీసాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(28 బంతుల్లో 5 ఫోర్లతో 32) మయాంక్ అగర్వాల్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), రిషి ధావన్(21 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. చమీరా, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్‌కు ఓ వికెట్ దక్కింది. మరి హోల్డర్-చహార్ ఘర్షణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Shardul Thakur: వీడియో: IPL హిస్టరీలోనే అత్యంత చెత్త బాల్ వేసిన శార్థుల్ ఠాకూర్!
R Chahar vs Holder Fighthttps://t.co/QuRKsiDL6q
— ishaan suri | King Kohli big fan (@ishaan_suri) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.