రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్‌రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించాలంటూ
‘విజయం అయితే మీది.. ఓటమి ఎదురైతే అది నాది’.. గుజరాత్ టైటాన్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన సహచరులతో చెప్పిన మాట ఇది. పాండ్యాకు ఐపీఎల్ టైటిల్స్ కొత్త కాదు. ఆటగాడిగా ముంబై ఇండియన్స్ తరఫున అతని ముద్ర ఎంతో ప్రత్యేకం. కానీ నాయకుడిగా మాత్రం ఇదే మొదటి అవకాశం. ఏ స్థాయి క్రికెట్‌లోనూ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. దాంతో అతను జట్టు ఎలా నడిపిస్తాడోనన్న సందేహం అందరిలోనూ ఉండేది. ఏదైతేనేం.. అన్ని జట్లు వద్దు అనుకున్న ఆటగాళ్లతోనే.. జట్టును ‘చాంపియన్స్’ గా నిలిపి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ గా పాండ్యాను నియమించాలంటూ పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఇన్నాళ్లు అతన్ని భారత జట్టులో ఉంచేందుకు కూడా ఇష్టపడని వారంత.. కెప్టెన్ చేయాలని డిమాండ్ చేసేంతగా హార్దిక్ ప్రదర్శన సాగింది.
CHAMPIONS 🏆 This is for all the hard work we’ve put in! Congratulations to all the players, staff, fans ❤️❤️❤️ @gujarat_titans pic.twitter.com/zEeqdygBEy
— hardik pandya (@hardikpandya7) May 29, 2022
ఇన్నాళ్లు రోహిత్ శర్మ వారసుడిగా.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు వారి కంటే ఎక్కువగా హార్దిక్ పేరు వినిపిస్తోంది. కపిల్ దేవ్‌లా జట్టుకు టైటిల్ అందించే సత్తా హార్దిక్‌కు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వయసు నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ భారత పగ్గాలను అందుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ మాదిరి రోహిత్ సైతం తన సారథ్య బాధ్యతలను వదులుకోవాల్సి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2022 సీజన్ టైటిల్ విన్నర్ గుజరాత్, రన్నరప్ రాజస్థాన్ కి ఎంత ప్రైజ్ మనీ దక్కిందంటే..?
ఈ సీజన్ లో హార్ధిక్ పాండ్యా సారథిగా అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత సీజన్‌లో హార్ధిక్ బాల్‌తో,బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ 487 పరుగుల తో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించాడు.
Here’s CricTracker’s best XI of IPL 2022. What’s your XI?🤔@klrahul | @josbuttler | @HoodaOnFire | @DavidMillerSA12 | @hardikpandya7 | @DineshKarthik | @Wanindu49 | @yuzi_chahal | @Russell12A | #IPL2022 pic.twitter.com/88jC2ajQM5
— CricTracker (@Cricketracker) May 30, 2022