ఐపీఎల్ 2022లో భాగంగా 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. తమ చివరి మ్యాచ్‌లలో గెలుపుతో రెండు జట్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్..ఈ జట్టుకు మంచి ఓపెనింగ్ జోడి ఉంది. చివరి మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడారు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అంత బలంగా ఏం లేదు. వార్నర్, పృథ్వీషా, పంత్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నారు. లలిత్ యాదవ్, పవెల్, శార్థుల్ ఠాకూర్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించలేం. కొద్ది సేపు మెరుపులు మాత్రమే మెరిపించగలరు. మార్ష్ కరోనా కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. ఇక బౌలింగ్‌లో ఢిల్లీ పటిష్టంగా ఉంది. ముస్తఫిజుర్, ఖలీల్ అహ్మాద్, శార్థుల్ ఠాకూర్ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్‌పటేల్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్..ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి తోడు దేవదత్త్ పడిక్కల్ కొన్ని మ్యాచ్‌ల నుంచి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇద్దరు రాణిస్తే.. రాయల్స్ భారీ స్కోర్ చేయగలదు. వన్‌డౌన్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ రాణిస్తున్నా.. బట్లర్ ఇచ్చిన స్టార్ట్‌తో భారీ స్కోర్ మల్చలేకపోతున్నాడు. మిడిల్డార్‌లో హెట్‌మేయిర్ ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక బౌలింగ్‌లో రాజస్థాన్ పటిష్టంగా ఉంది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ద్ కృష్ణ ఉండగా.. స్పిన్‌లో అశ్విన్, చాహల్ రూపంలో తిరుగులేని జోడి రాజస్థాన్ సొంతం. అలాగే బ్యాటింగ్‌లో అశ్విన్‌ను ముందు పంపపడం లాంటి ప్రయోగాలు చేయకపోవడం ఉత్తమం.
పిచ్..
ఈ మ్యాచ్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటిది. ఈ మ్యాచ్ హైస్కోరింగ్ మ్యాచ్‌గా సాగే అవకాశం ఉంది. ఛేజింగ్ చేసే జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రిడిక్షన్..
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించే అవకాశం ఉంది. బౌలింగ్‌తో పాటు.. ఆర్‌ఆర్ బ్యాటింగ్‌లో మంచి డెప్త్ ఉంది. రాజస్థాన్ బ్యాటర్లు వారి స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. విజయం నల్లేరుపై నడేకే.
తుదిజట్ల అంచనా..
రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, హెట్‌మేయిర్, డస్సెన్, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ
ఢిల్లీ.. రిషభ్ పంత్(కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, లలిత్ యాదవ్, పావెల్, శార్థుల్ ఠాకుర్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జియా, కుల్దీప్ యాదవ్, ముస్తఫీజుర్ రహెమాన్.
We go again tomorrow 🔥🤩
Goodnight, DC fam 💙❤️#YehHaiNayiDilli | #IPL2022 | #DCvRR#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/oq9FshE5LJ
— Delhi Capitals (@DelhiCapitals) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.