ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది ఢిల్లీ. కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తన పాత హోం టీమ్‌పై చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో SRH బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వార్నర్ ఆడిన ఒక విచిత్రమైన షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భువీ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని స్విచ్‌హిట్ ఆడబోయాడు వార్నర్.. అది పసిగట్టిన భువీ.. బాల్ మరింత లెగ్‌సైడ్ వైపు వేశాడు. దీంతో ఆడలనుకున్న షాట్ కుదరకపోవడంతో.. అప్పటికప్పుడు రైడ్ హ్యాండ్ బ్యాటింగ్ పొజిషన్‌లో ఉండి.. జస్ట్ బాల్‌కు బ్యాట్ ఆనించాడు అంతే… దీంతో ఆ బాల్ కూడా బౌండరీ వెళ్లింది. ముందుగా అనుకున్న షాట్ కాకుండా.. ఏదో విధంగా బాల్‌ను కొట్టినా అది బౌండరీ వెళ్లడంతో వార్నర్ హ్యాపీ అయ్యాడు. కానీ.. ఆ షాట్‌ను ఏ పేరుతో పిలవాలో తెలియక కామెంటేటర్లు అయోమయానికి గురయ్యారు. ఒక కొత్త షాట్‌ను వార్నర్ కనిపెట్టాడంటూ పేర్కొన్నారు. కానీ.. ఆ షాట్‌కు ఒక పేరు మాత్రం పెట్టలేదు. కింద ఉన్న వీడియో చూసి మరి మీరైనా వార్నర్ ఆడిన ఆ డిఫరెంట్ షాట్‌కు పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: సింగిల్ తీసిస్తా సెంచరీ చేసుకో అంటే.. వార్నర్ క్లాస్ పీకాడు: రోవ్మన్ పోవెల్
— Patidarfan (@patidarfan) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.