ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా వార్నర్ గోల్డెన్ డక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాడంటూ మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టాస్ ఓడి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగగా.. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వార్నర్ పెవిలియన్ చేరాడు. లివింగ్ స్టోన్ వేసిన ఫస్ట్ బాల్‌ను వార్నర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్‌లో తాకిన బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ చాహల్ సింపుల్ క్యాచ్ అందుకున్నాడు.
వాస్తవానికి డేవిడ్ వార్నర్ ఎప్పుడైన బ్యాటింగ్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్‌లోకి వెళ్తాడు. ఈ మ్యాచ్ లోనూ మొదట నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లోకి వెళ్లి నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. సర్ఫరాజ్‌ను వద్దని చెప్పి మరీ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. బహుషా గత మ్యాచ్‌ల్లో ఓపెనర్లుగా వచ్చిన మన్ దీప్ సింగ్, కేఎస్ భరత్‌లు తొలి ఓవర్లోనే అవుట్ అవ్వడాన్ని గుర్తు తెచ్చుకున్నాడో ఏమో.. సడెన్‌గా పిచ్ మధ్యకు వచ్చి సర్ఫరాజ్‌ను నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. సీనియర్ చెప్పడంతో సర్ఫరాజ్ మరో మాట చెప్పకుండా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లోకి వెళ్లి నిలబడ్డాడు. అయితే లివింగ్ స్టోన్ వేసిన తొలి బంతికే వార్నర్ ఔటవ్వడంతో అత్యుత్సాహం కొంపముంచిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తొలి బంతికి వికెట్ పడాలని రాసి ఉంది. ఆ దరిద్రం సర్ఫరాజ్‌కు దక్కకుండా తనకే దక్కాలని వార్నర్ కోరి మరి స్ట్రైయిక్ తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి. గత 8 ఐపీఎల్ సీజన్‌ల్లో వార్నర్ ఎప్పుడూ గోల్డెన్ డక్ అవ్వలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు, సర్ఫరాజ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి రాణించారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జితేష్ శర్మ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు చేసి రాణించాడు. మరి వార్నర్ గోల్డెన్ డక్, స్ట్రైకింగ్ మార్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: వీడియో: పంజాబ్‌కు అదృష్టం కలిసొచ్చినా.. విజయం వరించలేదు!
Scenes before the first ball🫤
📸: Disney+Hotstar@davidwarner31 | #IPL2022 pic.twitter.com/H49uFvpUWN
— CricTracker (@Cricketracker) May 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.