డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన సీఎస్‌కే.. ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయినప్పటికీ.. ఆ జట్టు ప్లేయర్లలో కొందరు మాత్రం అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చారు. అందులో శ్రీలంకన్ మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒకడు. మొదటి కొన్ని గేమ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఈ శ్రీలంకన్ స్పిన్నర్.. తర్వాత జట్టులో అవకాశ రావడంతో తానెంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన తీక్షణ 12వికెట్లు పడగొట్టాడు. తీక్షణకు చెన్నై లాంటి జట్టులో ఆడే అవకాశం అంత ఈజీగా ఏం దక్కలేదు. కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాడు. ఫిట్ నెస్ పరంగా ఎనలేని కష్టం చేశాడు. తన ఫిట్‌నెస్ కష్టాలను ఎలా అధిగమించాడో సీఎస్కే ట్విట్టర్ హ్యాండిల్‌లో అతను వివరించాడు.
” 2017-18 సమయంలో అండర్ -19 ఆడే సమయంలో 117 కేజీల బరువు ఉండేవాడిని. అధిక బరువు వల్ల ఫిట్నెస్ నిరూపించుకోలేక బెంచకే పరిమితయ్యేవాడిని. 2019లోనూ చాలా మ్యాచులకు వాటర్ బాయ్ గా పని చేశా. మరోసారి ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయితే వాటర్ బాటిల్స్ మోయాల్సి వస్తుందని అప్పుడే అనుకున్నా. ఆ సమయంలో ‘యోయో టెస్టు’ అంటే నాముందు కొండంత లక్ష్యం ఉన్నట్లే. అధిక బరువు ఉండడం వల్ల యోయో టెస్టు పాసవ్వడం చాలా కష్టమయ్యేది. అందుకే నా బరువును తగ్గించుకోవడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2020లో ఫిట్నెస్ సాధించాను. 2021లో శ్రీలంక తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో ఓ వన్డేలో మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కింది. ఇక చెన్నై తరపున గతేడాదిలోనూ జట్టుతోపాటు ఉన్నా.. నెట్ బౌలర్ ను మాత్రమే. అయితే మెగా వేలంలో చెన్నై జట్టు నన్ను తీసుకుంటుందని అసలు ఊహించలేదు” అని తెలిపాడు.
Big Dreams are not impossible if we Believe in the process! Hear it from Theekshana! 📹➡️#WhistlePodu #Yellove 🦁💛 @Dream11 #DreamBigDream11 pic.twitter.com/9gYbb3TPjT
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2022
ఇది కూడా చదవండి: CSK vs Jadeja: జడేజాని టార్గెట్ చేసిన CSK యాజమాన్యం!
ప్రస్తుతానికి చెన్నై జట్టులో నమ్మదగ్గ స్పిన్నర్లలో మహేశ్ తీక్షణ ఒకడు. మిడిల్ ఓవర్లే కాదు.. పవర్ ప్లేలో సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగల సమర్థుడు. ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచుల్లో 7.41 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/33. ఇక చెన్నై విషయానికొస్తే.. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. లీగ్ దశలో చెన్నై మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ మే 12న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
CSK made an absolute steal with Maheesh Theekshana for just INR 70 lakhs, has an economy below 7.5 and finishes with 3/27(4) today. Dushmantha Chameera may have had more economical spells but Maheesh has better qualifications to become Finance Minister. #RCBvCSK pic.twitter.com/d7vYoC2kZH
— Akhila Seneviratne (Will be back soon) (@AkhilaSene97) May 4, 2022
Sri Lanka’s 21-year-old Maheesh Theekshana gave just eight runs and picked three wickets in his last two death overs.
📸: Disney+Hotstar#MaheeshTheekshana #CSK #RCBvCSK #IPL2022 pic.twitter.com/CAe9iX9FFS
— CricTracker (@Cricketracker) May 4, 2022