ఐపీఎల్ 2022లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. 13 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్‌లో మూడో గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి.. చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సీజన్‌లో ఆది నుంచి అట్టర్‌ఫ్లాప్ అవుతూ వస్తున్న csk ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. తనతో పటు ఓపెనర్ కావ్వే కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దురదృష్టం ఏమిటంటే.. రుతురాజ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. 96 పరుగుల తర్వాత.. సెంచరీని దృష్టిలో పెట్టుకుని ఆ ఒత్తిడిలో రుతురాజ్ సింగిల్స్ తీసేందుకే మొగ్గుచూపాడు. దీంతో 99 పరుగుల వద్ద టీ నటరాజన్ బౌలింగ్‌లో పాయింట్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. వనడౌన్‌లో ధోని బ్యాటింగ్‌కు వచ్చి 7 బంతుల్లో 8 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లోనే ఉమ్రాన్ మాలిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కావ్వే 55 బంతుల్లో 85 పరుగులతో చెలరేగడంతో చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.భారీ లక్ష్యఛేదనను SRH ధాటిగానే ఆరంభించింది. కానీ.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(47), నికోలస్ పూరన్ (64 నాటౌట్) రాణించినా.. SRHను గెలిపించలేకపోయారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓడింది. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలిస్తే.. ప్లేఆఫ్ చేరుతుంది. ఈ మ్యాచ్‌తో చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోని మళ్లీ బాధ్యతలు స్వీకరించాడు. తన మార్క్ కెప్టెన్సీతో జట్టును అద్భుతంగా నడిపించాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై ఈ సీజన్‌లో ఇప్పుడు డిఫరెంట్‌గా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌లా ఆడిందని, ధోని కెప్టెన్‌గా ఉంటే.. చెన్నైను ఆపడం కష్టం అంటున్నారు CSK ఫ్యాన్స్.. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rahul Tewatia: గుజరాత్‌ను గెలిపిస్తున్న తెవాటియా.. టీమిండియాకు ఆడే టైమొచ్చిందా?
Thalaivan Irukkindraan! 🦁#SRHvCSK #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/WKgFGm1OC1
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2022
Lighting up the week with 💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/5TLcFDqyOF
— Chennai Super Kings (@ChennaiIPL) May 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.