ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 9వ ఓటమిని నమోదు చేసింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడింది. కాగా ఈ మ్యాచ్‌లో CSK బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. టీ20 లీగ్‌లో వన్డే బ్యాటింగ్ చేస్తున్నారంటై విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్), ఎం జగదీషన్ (39 పరుగులు 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి మరోసారి శుభారంభం దక్కలేదు. చెన్నై స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే 9 బంతులాడి కేవలం 5 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేసింది. తొలి నాలుగు ఓవర్లలో చెన్నై ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 8వ ఓవర్ వరకు పర్వాలేకున్నా.. 9వ ఓవర్లో సాయికిషోర్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (21పరుగులు 17 బంతుల్లో) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ మళ్లీ చప్పగా మారింది. ఈ క్రమంలో 15వ ఓవర్ వరకు నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రుతురాజ్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇక తర్వాత వచ్చిన శివమ్ దూబే డకౌట్ కాగా.. చివర్లో ధోనీ 10 బంతులాడి తన జెర్సీ 7తోనే సరిపెట్టాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి నాలుగు ఓవర్లు ఒక ఫోర్ కూడా కొట్టని చెన్నై బ్యాటర్లు చివరి ఐదు ఓవర్లు కూడా అదే చెత్త బ్యాటింగ్ చూపించారు. డెత్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. చేతిలో వికెట్లు ఉన్నా కూడా ఒక్క ఫోర్ కానీ, సిక్స్ కానీ చెన్నై బ్యాటర్ల నుంచి రాకపోవడం గమనార్హం. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను పూర్తిగా కంట్రోల్ చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి 109 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై కనీసం 150 లేదా 160 పరుగుల స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ సీన్ వేరేలా మారింది.
చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు చేసింది కేవలం 24 పరుగులు మాత్రమే.. అంటే డెత్ ఓవర్లలో 30 బంతుల్లో కేవలం 24పరుగులు మాత్రమే చెన్నై బ్యాటర్లు చేయగలిగారు. ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో డెత్ ఓవర్లలో అత్యంత చెత్త ప్రదర్శన ఇదే కావొచ్చు. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్న తరుణంలో ధోనీతో సహా చెన్నై బ్యాటర్లెవరు బ్యాట్ ఝళిపించలేకపోయారు. ఫలితంగా 133పరుగులకే చెన్నై పరిమితమైంది. బ్యాటర్లు విఫలం అయినా చెన్నై బౌలర్లు పర్వాలేదనిపించారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా గుజరాత్‌కు అంత ఈజీగా చేజ్ చేయనియలేదు. మ్యాచ్‌ను చివరి ఓవర్ తొలి బంతి వరకు తీసుకెళ్లారు. 134 పరుగుల లక్ష్యాన్ని గుజారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Matheesha Pathirana: IPL 2022లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బేబీ మలింగా
Not our day, but new rays of hope 💛#CSKvGT #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/d5EE3PcdlZ
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.