ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ స్టోయినీస్ సహనం కోల్పోయి అంపైర్‌పై నోరుపారేసుకున్నాడు. జోస్ హేజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతి ఆఫ్‌సైడ్ చాలా వైడ్‌గా వెళ్లింది. స్ట్రైక్‌లో ఉన్న స్టోయినీస్ కూడా ఆఫ్ స్టెంప్‌కు జరిగి ఆడడంతో అంపైర్ దాన్ని వైడ్ బాల్‌గా ప్రకటించలేదు. దీంతో స్టోయినీస్ అసహనం వ్యక్తం చేశాడు. రెండో బంతిని కూడా హేజిల్‌వుడ్ వైడ్‌గా సంధిస్తాడనే ఉద్దేశంతో స్టంప్స్‌ను వదిలి కుడివైపునకు వచ్చి బంతిని ఆడబోయాడు. దీన్ని ముందే పసిగట్టిన హేజిల్‌వుడ్ నేరుగా స్టంప్స్ మీదికి బంతిని విసిరాడు. దీంతో స్టోయినీస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తొలి బంతికి అంపైర్ వైడ్ ఇవ్వకపోవడం.. రెండో బంతికి బౌల్డ్ అవ్వడంతో స్టొయినీస్ సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయాడు. F**k off అంటూ గట్టిగా అరిచాడు. అదే ఆవేశంతో పెవిలియన్ దారి పట్టాడు. వెళ్లే సమయంలో తనకు ఎదురుగా వచ్చిన ఫీల్డర్‌పై బ్యాట్ ఎత్తడం కనిపించింది. అంపైర్ వైడ్ ఇవ్వలేదని ఆవేశానికి పోయి.. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నారు. అంపైర్‌పై అసభ్యపదజాలం ఉపయోగించడం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. దీంతో స్టోయినీస్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడని సీఓసీ కమిటీ స్టోయినీస్‌ను మందలించింది. మరో సారి ఇలాంటి ప్రవర్తన పునరావృతం అయితే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలి?
Stoinis almost hit RCB player pic.twitter.com/oFIFFzQF3v
— Big Cric Fan (@cric_big_fan) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.