ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులు సగానికిపైగా అయిపోయి.. ముగింపు దశకు చేరుకున్నాయి. దాదాపు అన్ని జట్లు 10 మ్యాచులు ఆడాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మంగళవారం(మే 3) ప్రకటించింది.
లీగ్ దశ మ్యాచ్‌లు మే 22న ముగియనుండగా.. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించనున్నాయి. లీగ్ మ్యాచులు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలను ఖరారు చేసింది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ ఈనెల 24, 25 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా.. 27న క్వాలిఫయర్-2తోపాటు తుది పోరు 29న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
Playoffs of IPL 2022 pic.twitter.com/XuQaM6GFOc
— RVCJ Media (@RVCJ_FB) May 3, 2022
మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసింది. లక్నో కాకుండా పుణె వేదికగా ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మరి ప్లేఆఫ్స్ కు ఏయే జట్లు అర్హత సాధిస్తాయి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Here is CricTracker’s playoffs probability meter after 46 matches in IPL 2022📊#IPL2022 pic.twitter.com/T47Y7BvPGc
— Gaurav Singh (@GauravS20880650) May 2, 2022