ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై ఘనవిజయం సాధించింది. యువ ఆటగాడు రజత్ పటీదార్ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి టాక్ ఆఫ్ ది క్రికెట్ న్యూస్‌గా మారాడు. అతని విధ్వంసం వల్ల ఆర్‌సీబీ జట్టు 208 పరుగుల లక్నో ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసి 14పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచుకు ముందు చోటుచేసుకున్న ఓ సంఘటన నవ్వులు పూయిస్తోంది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గార్డ్ పెట్టుకుంటుండగా వీడియో తీసిన కొందరు.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు.
అసలే పరుగులు చేయలేక సతమవుతున్న విరాట్ కోహ్లీ.. ప్రాక్టీస్ సెషన్ లో గంటల కొద్దీ కష్టపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కాసేపట్లో లక్నోతో మ్యాచ్ ఉందన్న సమయంలో.. ప్రాక్టీస్ చేద్దామనుకున్న విరాట్ కోహ్లీ గార్డ్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. క్రమంలో ఒక్కసారిగా స్టాండ్స్ వైపు చూసిన కోహ్లీ.. ఎవరో ఈ దృశ్యాన్ని కెమేరాలో బంధించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అలా చేయవద్దని కోహ్లీ చెబుతూనే ఉన్నాడు. అయినా అతను ఆపకపోవడం గమనార్హం. ఇది పట్టించుకోని కోహ్లి తన షర్ట్ తీసి గార్డ్‌ను పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ పైకి చూసిన కోహ్లికి కెమెరా తనవైపు ఉన్నట్లు అనిపించింది. నీ ఫోకస్ తగలెయ్యా.. కొంచెం ప్రైవసీ ఇవ్వు అన్నట్లుగా కోహ్లి సీరియస్ లుక్ ఇచ్చాడు.
bhai guard to pehn ne do usko 😂😂 pic.twitter.com/eMVfhnwgTH
— Ravi bhai (@highon_beer) May 24, 2022
ఇది కూడా చదవండి: మ్యాచ్ తర్వాత RCB డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు.. వీడియో వైరల్!
ఇక వర్షం అంతరాయంతో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ చేసింది. రజత్ పాటిదార్ 54 బంతుల్లో 112 నాటౌట్ సూపర్ సెంచరీతో మెరవగా.. కార్తీక్ 37 , కోహ్లి 25 పరుగులు చేశారు. ఇకపోతే ఆర్సీబీ మే 27న క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.