ఐపీఎల్-2022లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. లక్నో టీమ్ ను ఉత్సాహపరిచేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన కేఎల్ రాహుల్ ప్రేయసి అతియా శెట్టి.. అతను ఔటైన తీరు చూసి నిరుత్సాహనికి గురైనట్లు కనిపించింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడిన లక్నో జట్టు 162/8కే పరిమితమైంది. లక్నో ఆరంభంలో వికెట్లను కోల్పోయి ఉక్కిరిబిక్కిరైంది. కేఎల్ రాహుల్.. తాను ఎదుర్కొన్న తొలిబంతికే క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ క్రమంలో మ్యాచ్ ను వీక్షించేందుకు వాంఖడే స్డేడియానికి వచ్చిన కేఎల్ రాహుల్ లవర్ అతియా శెట్టి.. రాహుల్ ఔటైల తీరు చూసి షాకైంది.
Action Reaction#IPL2022 #RRvsLSG pic.twitter.com/OELFIaKXwU
— CRICKET🏏 (@AbdullahNeaz) April 10, 2022
రాహుల్ ఔట్ ను నమ్మలేనట్లుగా షాక్ లో ఉండిపోయింది. అతియాశెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా మ్యాచ్ ని చూడటానికి వచ్చారు. కానీ.. ఇలా రాహుల్ మొదటి బంతికే ఔటైపోవడంతో.. తండ్రి కూతురు.. ఇద్దరూ చాలా సేపు బాధపడుతున్నట్లు కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kudos to boult 🤗
This was superb inswing 😱#RRvsLSG #Boult #HallaBol @IamSanjuSamson @josbuttler pic.twitter.com/RAmE5u4Qez
— ♥ Sanju Samson (RR), KKR & PBKS #IPL2022♥ 🇮🇳 (@karmkhush2229) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.