ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపు ఖాయం అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ఇప్పటకే ప్లే ఆఫ్స్ బెర్తులు రిజర్వ్ చేసుకున్నాయి. ఇంక ఒక్క స్థానం కోసం ఢిల్లీ, బెంగళూరు జట్లు పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే బెంగళూరు జట్టు 14 మ్యాచ్ లు ఆడేసి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబైతో జరిగే మ్యాచ్ లో గనుక ఢిల్లీ గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు వెళ్లిపోతుంది. ఎందుకంటే బెంగళూరు నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండగా.. ఢిల్లీ రన్ రేట్ ప్లస్ లో ఉంది. కాబట్టి ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు తప్పుకోవాల్సిందే. అదే ముంబై జట్టు ఢిల్లీని ఓడిస్తే బెంగళూరు రూట్ క్లియర్ అవుతుంది.
అందుకే ముంబైతో మ్యాచ్ కు బెంగళూరు అభిమానులు మొత్తం రోహిత్ సేనకే ఓటేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ముంబై జట్టు ఢిల్లీని ఓడిస్తే.. ఆర్సీబీ జట్టు మొత్తం హ్యాపీగా ఉంటుంది. కానీ, ఒక్క కోహ్లీ మాత్రం దిగాలుగా ఉండక తప్పుదు. ఎందుకంటే.. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో ఎంతో చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ముంబై వల్ల ఆర్సీబీ ప్లేఆఫ్స్ కి వెళ్తే ఫ్యాన్స్ ఎలాగూ ఆ క్రెడిట్ ని రోహిత్ కే ముట్టచెబుతారు.
ఒకవేళ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లి ఫైనల్ చేరి, కప్పు కొట్టిందంటే… బెంగళూరు జట్టు, అభిమానులు ఇంకా హ్యాపీ. కానీ, కోహ్లీ మాత్రం ఎంతో బాధలో ఉండాల్సి వస్తుంది. మళ్లీ ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇన్నేళ్లలో కోహ్లీ సాధించలేనిది, రోహిత్ ఢిల్లీ ఓడిస్తే బెంగళూరు ప్లే ఆఫ్స్ కెళ్లి కప్పుకొట్టిందని మళ్లీ ఆ క్రెడిట్ ని రోహిత్ కే ముట్టచెబుతారు. ఇలా ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లినా, కప్పు కొట్టినా కోహ్లీ మాత్రం ఆనందంగా ఉండే పరిస్థితి లేదంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో థియరీలు చెబుతున్నారు. ఈ సీజన్లో కోహ్లీ విఫలం కావడానికి కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📽️ The stats & numbers that lead to #MIvDC! 💙#OneFamily #DilKholKe #MumbaiIndians pic.twitter.com/7RrY4kJmNp
— Mumbai Indians (@mipaltan) May 21, 2022