ఐపీఎల్ 2022 సీజన్ మరింత ఉత్కంఠగా మారింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై, చెన్నై రెండూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ముంబైపై అతి దారుణమైన పరాజయాన్ని నమోదు చేసింది. కేవలం 16 ఓవర్లలో 97 పరుగులకే చెన్నై ఆలౌట్ కాగా ముంబై కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా సమష్టి కృషితో రాణించింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ లోని కుర్రాళ్లపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు తేజం తిలక్ వర్మను హర్భజన్ సింగ్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
ఇదీ చదవండి: టీమిండియాలోకి తెలుగు తేజం తిలక్ వర్మ! విరాట్ కోహ్లీ స్థానంలోనే..
ముంబై జట్టు గురించి మాట్లాడుతూ తిలక్ వర్మపై హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ గురించి మాట్లాడుతూ.. ‘ముంబై ఇండియన్స్ జట్టులో తిలక్ వర్మ, బ్రెవిస్ లాంటి కుర్రాళ్లు ఉండటం ఎంతో శుభ సూచకం. ఇలాంటి కుర్రాళ్లపై పెట్టుబడి పెట్టి యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంది. రానున్న పదేళ్లు వీళ్లు జట్టుకు మంచి సేవలందిచగలరు. ముఖ్యంగా తిలక్ వర్మకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి. ముంబై జట్టుకు ఫ్యూచర్ కెప్టెన్ అయ్యే లక్షణాలు తిలక్ వర్మలో చాలా ఉన్నాయి’ అంటూ హర్భజన్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ తిలక్ వర్మ.. మొత్తం 12 మ్యాచ్ లలో 133 స్ట్రైక్ రేట్ తో 368 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ముంబై కెప్టెన్ అవుతాడన్న హర్భజన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయండి.
Well played Tilak Varma 👏 carried the team through a win. Congratulations @mipaltan Well bowled to restrict @ChennaiIPL to a low score of 97. Dhoni tried to put on some runs, but didn’t get the needed support from the other end. MI was the better team tonight. #MIvCSK #IPL2022
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 12, 2022
Star boy of Mumbai Indians in IPL 2022 – Tilak Varma:
– Leading run scorer
– 368 runs
– 40.88 average
– 132.85 strike rate pic.twitter.com/dmOzOCvKgH— Johns. (@CricCrazyJohns) May 12, 2022
What a season it’s been for Tilak Varma 👌 https://t.co/vx5Nlhnh2Q #IPL2022 pic.twitter.com/H1lisnjy4K
— ESPNcricinfo (@ESPNcricinfo) May 13, 2022