IPL కి ముందు మరో వివాదంలో హార్దిక్ పాండ్యా!

ఐపీఎల్‌ 2022 సీజన్ రెట్టించిన ఉత్సాహాన్ని నింపనుంది. ఎందుకంటే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇవ్వడం, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ టీమ్ కెప్టెన్ గా ఉండటం అభిమానుల్లో జోష్ నింపింది. కానీ, హార్దిక్ పాండ్యా ప్రవర్తన మాత్రం ప్రేక్షకుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. వాళ్ల టీమ్ జెర్సీ లాంఛ్ కార్యక్రమం నిర్వహించిన టీమ్ కు వారి కెప్టెన్ పై ట్రోల్స్ చూసి దిమ్మతిరిగింది. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. మరీ అంత అతి ఆత్మవిశ్వాసం పనికిరాదంటున్నారు ఫ్యాన్స్.

ఇదీ చదవండి: IPL 2022 నిబంధనల్లో కొత్త మార్పులు!

విషయం ఏంటంటే.. గుజరాత్ టైటాన్స్ జెర్సీ లాంచ్ సమయంలో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హార్దిక్ తలతిక్క సమాధానం చెప్పాడు. ‘హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌ 2022 సీజన్ లో బౌలింగ్ చేయడం చూస్తామా? మీరు అంత ఫిట్ గా ఉన్నారా?’ అని ప్రశ్న అడిగాడు. అందుకు పాండ్యా ‘అది సర్‌ప్రైజ్.. దానిని అలా సర్‌ప్రైజ్‌లాగానే ఉంచండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ సమాధానం విన్న రిపోర్టర్ నవ్వుతూ కూర్చున్నాడు. కానీ, సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మాత్రం అలా ఊరుకోలేదు. పాండ్యాపై ట్రోల్స్ ప్రారంభించారు.

సర్ ప్రైజ్ లా ఉంచాలి అని చెప్పడం ఏంటి? అతని గురించి అతను ఏమైనా గ్లెన్ మెగ్రాత్ అనుకుంటున్నాడా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు పాండ్యా తన గురించి తాను చాలా ఊహించుకుంటున్నాడు. జాక్వస్ కలిస్ అనుకుంటున్నాడు పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు. అలా అతను ఏదో సర్ ప్రైజ్ అన్న మాటను వీపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగానే హార్దిక్ తన గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV